దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్.ఆర్.ఆర్' ను అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాని రిలీజ్ చేసే పరిస్థితులు లేకపోవడం RRR చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ స్లాట్ కోసం మిగతా చిత్రాలు పోటీ పడే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ మాస్ మసాలా చిత్రాన్ని దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురాడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అక్కినేని అఖిల్ - డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఇప్పుడు దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారట. అలానే అక్టోబర్ 8న విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న క్రిష్ జాగర్లమూడి - వైష్ణవ్ తేజ్ ల సినిమాని కూడా అక్టోబర్ 13న రిలీజ్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారట.
అక్టోబర్ 1న సాయి తేజ్ 'రిపబ్లిక్' మూవీ థియేటర్లలోకి వస్తుంది. అందుకే తమ్ముడి 'కొండపొలం' చిత్రాన్ని మరో వారం ముందుకు జరపాలని చూస్తున్నారట. ఇదే క్రమంలో బాలయ్య - బోయపాటి 'అఖండ' కూడా విజయదశమి నే టార్గెట్ చేయాలని చూస్తోంది. పాన్ ఇండియా సినిమాలన్నీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదనేది క్లియర్ గా అర్థం అవుతోంది కాబట్టి.. 'అఖండ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' వంటి సినిమాలకు దసరా మంచి సీజన్ అనే అనుకోవాలి.
'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ''అఖండ'' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇది మాస్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. మరి త్వరలోనే విడుదల తేదీలపై ఈ సినిమాలు క్లారిటీ ఇస్తాయేమో చూడాలి.