లెక్కలు మారుస్తున్న మహానాయకుడు

Update: 2019-02-06 07:47 GMT
ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఊహించని విధంగా డిజాస్టర్ కావడం మహానాయకుడి మీద పెను భారాన్ని మోపుతోంది. సీక్వెల్ కాబట్టి కథను ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఉండదు.వాస్తవాలకు లోబడి నందమూరి నారా కుటుంబాల మీద ఎలాంటి నెగటివ్ మార్క్ లేకుండా పెద్దాయన రాజకీయ జీవితాన్ని చూపించాల్సి ఉంటుంది. మొదటి భాగం సక్సెస్ అయ్యుంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏవైనా లోపాలు తప్పులు ఉన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఈజీగా పాస్ అయిపోయేది.

కాని దాని తాలుకు నష్టాలు సైతం భర్తీ చేయాల్సిన ఒత్తిడితో ఇప్పుడు చాలా మార్పులను డిమాండ్ చేస్తోంది. క్రిష్ వాటి మీదే సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. మరోపక్క బాలన్స్ షూటింగ్ జరుపుతూనే కావాల్సిన మాసాలాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే పనిలో పడ్డారు క్రిష్ అండ్ టీమ్. ఇప్పుడు మహానాయకుడు ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒకపక్క వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీతో కవ్విస్తున్నాడు. మరోపక్క రెండు రోజుల్లో యాత్ర రాబోతోంది. ట్రైలర్ ఆడియో రెండు మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇది కనక హిట్ అయితే అప్పుడు ఎన్టీఆర్ మీద ప్రెజర్ రెట్టింపు అవుతుంది. వద్దన్నా పోలికలు వస్తాయి కాబట్టి దాన్ని మించి తీయాలనే తాపత్రయం మొదలవుతుంది.

వీటిని తట్టుకుంటారా లేదా అనేది అసలు బాలయ్య మనసులో ఏ రిలీజ్ డేట్ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీలు కనీసం ఇరవై రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిస్తారు. ఆ మేరకు థియేటర్ల కేటాయింపులు చేసుకోవడనికి ఈజీ అవుతుంది కాబట్టి. కానీ మహానాయకుడి విషయంలో అలాంటి కదలిక ఏమి కనిపించడం లేదు. రాజకీయ జీవితం కాబట్టి రానున్న ఎన్నికలను దృష్టిలో టిడిపిని ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ గొప్పదనాన్ని చాటేలా ఉండాలి కాబట్టి మహానాయకుడు ఈ నెలలో రావడం అనుమానమే


Tags:    

Similar News