ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల తేదీపై మొదటి నుంచి ఎంతో అయోమయం నెలకొని ఉంది. మొదట ఈ సినిమాను రిపబ్లిక్ డే వీకెండ్లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ మొదటి భాగానికి రెండో భాగానికి గ్యాప్ చాలా తక్కువ అవుతుందని ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఆశించిన ఫలితం సాధించకపోవడంతో రెండు భాగంలో కొన్ని మార్పుచేర్పులు చేయడంతో రిలీజ్ డేట్ మారింది.
ఒకవారం ఆలస్యంగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ టెక్నికల్ ఇష్యూస్.. సెన్సారింగ్ లాంటివి దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 21 న రిలీజ్ కు రెడీ అయ్యారని అన్నారు. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ సినిమా విడుదల మరింతగా ఆలస్యం అవుతుందట. బాలయ్యకు ముహూర్తాల విషయంలో చాలా పట్టింపు ఉన్న సంగతి తెలిసిందే. మంచి ముహూర్తం లేకుండా ఆయన ఎలాంటి పని కూడా ప్రారంభించరు. సినిమా విడుదల విషయంలో కూడా అయన ముహూర్తబలం చూసుకుంటారు. అందుకే ఈ సినిమాను శివరాత్రి పండుగకు మూడు నాలుగు రోజుల ముందుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ ఏడాది శివరాత్రి మార్చ్ 4 వ తేదీ. ఫిబ్రవరికి 28 రోజులే కాబట్టి నాలుగు రోజుల ముందు అయితే ఫిబ్రవరి 28 వ తేదీ మూడు రోజుల మూడు అయితే మార్చి 1 వ తారీఖు. ఈ రెండు డేట్లలో ఒకటి ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాలయ్య మనసులో ఏముందో?