99 సినిమాల కృషి ఫలితం ఈ 100

Update: 2016-04-08 13:38 GMT
ఏదైనా కూడా బాలయ్య బాలయ్యేనండీ. ఒక విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా పంచ్‌ కొట్టినట్లు చెప్పేయడంలో ఆయనకు ఆయనే సాటి.

''అందరూ 100వ సినిమా అంటున్నారు. 100వ సినిమా ఎప్పుడొస్తుంది? కథ ఏంటి? డైరక్టర్‌ ఎవరు? అంటూ అడగుతున్నారు. కాని ఈ 100 అనడం ఈజీయే. కాకపోతే 100వ సినిమా అనే గౌరవం దక్కడానికి.. 99 సినిమాలు చేశాను. అదే అతి పెద్ద ఎచీవ్‌ మెంట్‌'' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. అమరావాతిలో ఈరోజు 100వ సినిమా గురించి ప్రకటిస్తూ.. ఆయన ఈ కామెంట్‌ చేశారు. ఎన్నో కథలు విన్న తరువాత క్రిష్‌ చెప్పిన ''గౌతమీపుత్ర శాతకర్ణుడు'' పాత్ర తనను బాగా ఇంప్రెస్‌ చేసిందని.. ఇది ఒక తెలుగు వీరుడి చరిత్ర అని.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పారు ఆయన.

''రామారావుగారినే స్ఫూర్తిగా తీసుకొని.. నా సినిమాలే నాకు పోటి అంటూ సాగిపోతుంటా'', అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య. యావత్‌ భారతదేశాన్ని పాలించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ని రాజు పాత్రను పోషించడం.. చాలా ఆనందంగా ఉందని చెబుతూ.. ''మా నాన్నగారి ఆశిస్సులతో ఈ స్ర్కిప్టు నాకు వచ్చినట్లుంది'' అన్నారు.
Tags:    

Similar News