నాన్న జీవిత కథ ఆధారంగా తాను నటించబోయే సినిమాకు షూటింగ్ ముందే టీజర్ తీయిస్తూ కొత్త ట్రెండ్ కు నాంది పలికిన బాలకృష్ణ నిన్న జరిగిన దాని ప్రారంభోత్సవం మాత్రం రహస్యంగా జరిపించడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ గురించి పోటీ పడి మరీ వర్మ - కేతినేని లాంటి వాళ్ళు సినిమాలు తీయడానికి ఎగబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు డ్రాప్ అయ్యారని మరో టాక్ కూడా ఉంది. వీటి వల్ల అనవసర రాద్ధాంతం జరిగిందని అందుకే టీజర్ షూటింగ్ ఎవరికి తెలియకుండా ప్లాన్ చేయమని నిర్మాతకు - దర్శకుడు తేజకు బాలయ్య ముందే చెప్పాడట. కాని ఒక యూనిట్ మెంబెర్ అత్యుత్సాహంతో తన సర్కిల్ లో ఆ న్యూస్ షేర్ చేయటంతో అది కాస్త మీడియా చెవిన పడటం - మెయిన్ న్యూస్ గా అందరు సర్కులేట్ చేయటం చకచక జరిగిపోయాయి.
అసలు టీజర్ షూటింగ్ సంగతి బయటికి రాకూడదు అని గట్టిగా అనుకున్నప్పుడు ఇలా లీక్ జరగడం పట్ల బాలకృష్ణ కొంచెం హర్ట్ అయినట్టు టాక్. అందుకే టీజర్ షూటింగ్ సందర్భంగా ఎవరిని సెల్ ఫోన్స్ తో సెట్ లోకి అనుమతించడం లేదని వార్త. జనవరి మూడో వారంలోనే టీజర్ విడుదల చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు టీం మెంబెర్స్. అంతవరకు స్టిల్స్ కాని - లుక్ కాని బయటికి రాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని బాలయ్య ఆర్డర్ వేసినట్టు కూడా తెలిసింది. పాత ఎన్టీఆర్ క్లిప్పింగ్స్ కొన్ని చూపించి ఆ పాత్రలో బాలకృష్ణ ఎలా కనిపిస్తారు అనే విషయాన్నీ కూడా రివీల్ అయ్యేలా టీజర్ ని కట్ చేయబోతున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హీరొయిన్ సెలక్షన్ ఇంకా జరగాల్సి ఉంది.