అమెరికాలో బాలయ్య బాబు అదిరిపోయే కలెక్షన్లు..!

Update: 2023-01-20 08:51 GMT
నటసింహం.. నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో దిగి భాక్సాఫీసును బద్ధలు కొట్టాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా అమెరికాలో బాలయ్య బాబుకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చాలా సినిమాలు అక్కడ కూడా విడదలడం, భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించడం పరిపాటిగా మారింది.

తాజాగా వచ్చిన వీరసింహా రెడ్డి అమెరికాలో 1.04 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది అన్ని సినిమాలకంటే ఈ సినిమాకే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూలు అయ్యాయి. అలాగే నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అఖండ సినిమా మొన్నటి వరకు అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమాగా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అమెరికాలో రిలీజ్ అయి 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది.

అంతకు ముందు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కూడా బాగానే ఆడింది. ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకునేందుకు కొందరు సినిమాను చూడగా.. బాలకృష్ణ తండ్రి పాత్రలో ఎలా కనిపించారో తెలుసుకునేందుకు మరికొందరు సినిమాను చూశారు. సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే.. యూఎస్ లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లనే సాధించింది. 928 వేల డాలర్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 2014లో విడుదలైన లెజెండ్ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. సింహ తర్వాత బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబోలో వచ్చిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాలీ, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా కూడా అమెరికాలో రిలీజ్ అయి 420 వేల డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్.. బాలయ్య బాబుకు బయట దేశాల్లో కూడా ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నట్లు ఈ కలెక్షన్లను చూస్తేనే అర్థం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News