నందమూరి బాలకృష్ణ వందో సినిమాకి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. ఇప్పటికే ఇతర నటీనటుల ఎంపిక కూడా ప్రారంభం అయిపోయింది. ప్రస్తుతం పాత్రలకు అనుగుణంగా యాక్టర్లను ఎంపిక చేయడంలో బిజీ అయిపోయాడు దర్శకుడు క్రిష్. ఈయన డైరెక్షన్ లో యోధుడు అనే టైటిల్ పై గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటించేందుకు సిద్ధం అవుతున్నారు. అధికారిక ప్రకటన మినహాయిస్తే... మిగిలిన వర్క్స్ అన్నీ జరిగిపోతున్నాయి.
ఏప్రిల్ 8న తన సెంచరీ మూవీపై బాలకృష్ణ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నారు. అసలు ఆ గౌతమీ పుత్ర శాతకర్ణి అంటేనే ... గౌతమికి కొడుకు శాతకర్ణి అర్ధం. అలా అమ్మ పేరు కలిసొచ్చేలా ఆ చక్రవర్తి పేరు ఉంటుంది. ఆ రాజు తల్లి అంటే రాజమాతగా నటించేందుకు సీనియర్ నటీమణనులను సంప్రదిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. ఈ రోల్ ని హేమమాలినితో కానీ, శోభనతో కానీ చేయించాలన్నది బాలకృష్ణ యోచన. అయితే.. గతంలో శోభనకు జంటగా బాలయ్య నటించి ఉండడంతో.. హేమమాలిని వైపే మొగ్గుతున్నారని తెలుస్తోంది.
ఇక బాలయ్య లాండ్ మార్క్ మూవీలో హీరోయిన్ గా నయనతారను సంప్రదిస్తున్నారు. ఒకవేళ ఆమె కనుక డేట్స్ ఎడ్జస్ట్ చేయలేకపోతే.. ఇతర ఆప్షన్స్ వెతుక్కోవాలని క్రిష్ భావిస్తున్నాడు. ఏప్రిల్ 8న యోధుడుపై ప్రకటన చేసి ఏప్రిల్ 22నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.