బండ్ల గణేష్ కళ్లెప్పుడూ పెద్ద హీరోల మీదే ఉంటాయి. ఆయన చిన్నా చితకా సినిమాలు తీయడు. సూపర్ స్టార్లతోనే సినిమాలంటాడు.. అవి కూడా బ్లాక్ బస్టర్లు కావాల్సిందే అంటాడు. ఐతే గత ఏడాది ‘టెంపర్’ మంచి విజయాన్నే అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఏడాది పాటు అడ్రస్ లేకుండా పోయాడు బండ్ల. ఐతే ఈ మధ్యే ఉన్నట్లుండి మలయాళ హిట్ మూవీ ‘టు కంట్రీస్’ను రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించి వార్తల్లోకి వచ్చాడు. ఆ సినిమాకు హీరో, దర్శకులు ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇంతలోనే బండ్ల నుంచి ఇంకో కొత్త అనౌన్స్ మెంట్ వచ్చింది. మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బండ్ల.
ఈ సినిమాకు టైటిల్ కూడా అనౌన్స్ చేసేశాడు బండ్ల. నాగ భైరవ.. ఇదేనట బండ్ల గణేష్-రాఘవ లారెన్స్ కాంబినేషన్లో రాబోయే సినిమా పేరు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయని.. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను నిర్మిస్తానని.. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు బండ్ల. బహుశా ‘కాంఛన’ సిరీస్ లో లారెన్స్ తర్వాత చేయబోయే సినిమా ఇదే కావచ్చు. ఆల్రెడీ తమిళంలో ఈ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ హక్కులు బండ్ల సొంతం చేసుకున్నట్లున్నాడు. లారెన్స్ ప్రస్తుతం ‘పటాస్’ రీమేక్ ‘మొట్ట శివ కెట్ట శివ’లో నటిస్తున్నాడు. అది అతను డైరెక్ట్ చేస్తున్న సినిమా కాదు. దాని తర్వాత బండ్ల అంటున్న ప్రాజెక్టు మొదలు కావచ్చు.