పట్టువదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం పోరాడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సీత కూడా చేదు ఫలితాన్నే ఇచ్చింది. అమాయకుడిగా కొత్త షేడ్స్ లో చేసిన ప్రయత్నం నటన పరంగా మార్కులు ఇచ్చినప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండటంతో శీను హెల్ప్ లెస్ అయ్యాడు. వచ్చే నెలలో బెల్లంకొండ కొత్త సినిమా రాక్షసుడు విడుదల కాబోతోంది. తమిళ బ్లాక్ బస్టర్ రట్ససన్ కు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కోసం సాయి శ్రీనివాస్ తన లుక్స్ లో చాలా మార్పులు చేసుకున్నాడు.
అంతుచిక్కని రీతిలో హత్యలు చేస్తున్న ఓ కరుడుగట్టిన సైకోని వెతకే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓ కొత్త తరహా పాత్రను ఇందులో పోషిస్తున్నాడు . దీని కోసం డెవలప్ చేసుకున్న బాడీని రివీల్ చేస్తూ చేయించుకున్న ఫోటో షూట్ తాలుకు పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
బాగా కండలు పెంచడంతో పాటు మేచో మ్యాన్ లుక్ వచ్చేలా చేసిన వర్క్ అవుట్స్ ఫిజికల్ గా మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు ఉన్నాయి.
త్వరలో చేయబోయే ప్రాజెక్ట్స్ లో కూడా సాయి శ్రీనివాస్ ఇదే లుక్ లో కనిపించనున్నాడు. ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి రాక్షసుడు మీద సాయి శ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. దానికి తగ్గట్టే బిజినెస్ డీల్స్ కూడా క్రేజీగా వస్తున్నాయి. ఇది కనక హిట్ అయితే మార్కెట్ పుంజుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్ గా నటించిన రాక్షసుడుకి రమేష్ వర్మ దర్శకుడు. సాహోకు బిజిఎం అందిస్తున్న జీబ్రాన్ సంగీతం దీనికి మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది