ఓవర్సీస్ లో 'భీమ్లా' వసూళ్ల సునామీ..!

Update: 2022-02-26 09:30 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ఢీ పోటాపోటీగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ మార్కెట్ లోనూ ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అదరగొడుతోంది.

'భీమ్లానాయక్' సినిమా యూఎస్ లో ప్రీమియర్ షోల ద్వారా 858K డాలర్లు వసూలు చేసి టాప్ 10 లిస్ట్ లో చేరింది. శుక్రవారం సాయంత్రానికి 343 లొకేషన్స్ నుంచి మరో $368K కలెక్షన్స్ యాడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమా ఓవర్ సీస్ లో దాదాపు 1.25 మిలియన్ డాలర్లు వసూళ్ళు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అలానే యూఏలో 'భీమ్లా' మూవీ 1.80 కోట్లు - ఆస్ట్రేలియాలో A$153,593 - న్యూజిలాండ్ లో A$10,559 కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాని ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడమే కాకుండా.. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అంతేకాదు కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద తెలుగు చిత్రం కావడంతో ఓవర్ సీస్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇకపోతే యూఎస్ఏ ప్రీమియర్స్ టాప్10 జాబితాలో 'భీమ్లా నాయక్' సినిమా 7వ స్థానానికి చేరుకుంది. ఈ మధ్య విడుదలైన 'పుష్ప' సినిమా కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. బాహుబలి 2 ($4,517,704) - అజ్ఞాతవాసి ($1,521,438) - బాహుబలి ($1,364,416) - ఖైదీ నెం.150 ($1,295,613) - స్పైడర్ ($1,005,630) - సాహో ($9,15,224) - భీమ్లా నాయక్ ($858000) - సైరా ($8,57,765) -  భరత్ అనే నేను (850K - ఫస్ట్ డే $1.4 మిలియన్) - అల వైకుంఠపురములో ($8,09,072) వంటి సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి.

నిజానికి కరోనా పాండమిక్ తర్వాత ఓవర్ సీస్ లో జనాలు థియేటర్లకు రావడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో 'భీమ్లా నాయక్' సినిమా అప్పుడే $1.25 మిలియన్ల డాలర్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ నంబర్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

కాగా, మలయాళంలో సూపర్ హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ''భీమ్లానాయక్''. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
Tags:    

Similar News