అందానికి చెప్పే కొలమానాలు ఏమీ లేకున్నా.. తనదైన అందంతో ఒక తరం యూత్‌కు నిద్ర లేకుండా చేసిన అందం భూమిక. ఇలాంటి గాళ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండన్నట్లుగా ఉండే ఆమె రూపు.. ఆమె ఎంపిక చేసుకునే పాత్రలు ఆమె మీద అభిమానాన్ని అంతకంతకూ రెట్టింపు చేశాయి.
భరత్ ఠాకూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భూమిక నిర్ణయం అప్పట్లో కుర్రకారును చాలానే నిరుత్సాహానికి గురి చేసింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించని భూమిక.. భర్త చేసే సినిమా వ్యాపారానికి చేయూతను ఇచ్చింది. అయితే.. ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో భారీగా దెబ్బ పడిందని చెబుతారు.
కారణాలు ఏమైనా కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన భూమిక ఫ్యామిలీ తిరిగి వెళ్లిపోయారు. విరామం తర్వాత తాజాగా ఆమె నటించిన చిత్రం ఎంసీఏ. హీరో పాత్రకు వదినగా..ముక్కుసూటి ఆఫీసర్ గా నటించి మెప్పించిన భూమిక.. తెలుగులో తన రెండో ఇన్నింగ్స్ ను షురూ చేసినట్లే. వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటున్న ఆంటీని ఈ మధ్యన మీడియా బాగానే ఫోకస్ చేసింది.
ఎంసీఏ చిత్రానికి సంబంధించి నాని కంటే భూమికకే మీడియా ప్రాధాన్యం ఇచ్చిందన్న మాట ఉంది. ఇదిలా ఉంటే.. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత అంశాన్ని ప్రశ్నించారు. సినిమా నిర్మాణం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారన్న మాట నిజమేనా? అంటే.. అలాంటిదేమీ లేదని చెప్పటమే కాదు.. కాస్త కోపంగానే సమాధానమిచ్చింది.
అర్థం లేని ఆరోపణలకు తాను జవాబులు ఇవ్వలేనని.. అలా చేస్తే.. సమాధానాలు చెప్పటానికే సమయం సరిపోతుందన్నారు. ఆర్థికంగా తాను ఇబ్బందుల్లో లేనన్న భూమిక.. ఆర్థికంగా సాయం చేయాలని తానెప్పుడూ ఎవరినీ అడగలేదన్నారు. అయినా.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో తనకు అర్థం కావన్న ఆమె.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నటిస్తున్నానన్న వాదనలో అస్సలు నిజం లేదన్నారు.
సినిమా తీయటం ఇక ఆపేసినట్లేనా? అన్న ప్రశ్నకు బదులిస్తూ సినిమాలు తీసే విషయంలో కొన్ని అంశాల మీద అవగాహన లేని కారణంగా చేతులు కాల్చుకున్నానని.. ఆర్థికంగా ఫెయిల్ అయినా మంచి సినిమాలు తీశానన్న పేరును తెచ్చుకున్నారు. చూస్తుంటే.. సమీప భవిష్యత్తులో సినిమాలు తీసే ఆలోచనలో భూమిక లేదని చెప్పక తప్పదు.