బిగ్‌ బాస్‌: బాబాపై కాలు దువ్విన ఆలీ

Update: 2019-10-22 05:36 GMT
ఒకసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అలీ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నట్లు కనపడుతుంది. బయట పరిస్థితులన్నీ తెలుసుకుని వచ్చిన అలీ అందుకు తగ్గట్టుగానే ఇంటి సభ్యులతో మెలుగుతున్నాడు. ముందు శ్రీముఖి, బాబాలతో క్లోజ్ ఉన్న అలీ రీ ఎంట్రీ తర్వాత రాహుల్‌తో క్లోజ్ అయ్యాడు. అలాగే వచ్చిన దగ్గర నుంచి బాబాని గట్టిగా టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. బాబా మాస్క్ తీయలేదంటూ పదే పదే చెబుతూ నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా చేయడం వెనుక గేమ్ ప్లాన్ ఉన్నట్లే కనపడుతుంది.

ఈ క్రమంలోనే సోమవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ నామినేషన్ టాస్క్ ఇచ్చాడు. ఆరు రౌండ్లుగా జరిగే ఈ టాస్క్ లో చివరికి ఎవరు గెలిస్తే వారు డైరెక్ట్ గా ఫినాలేకి చేరుకుంటారు. మిగిలిన సభ్యులు నామినేట్ అవుతారు. అయితే ఈ టాస్క్ గెలిచి నామినేషన్ నుంచి తప్పించుకోవాలని అలీ చాలా అగ్రెసివ్‌ గా గేమ్ ఆడాడు. ఒకవేళ నామినేషన్ లోకి వెళితే ఈసారి తాను ఎలిమినేట్ కావడం పక్కా అని తెలుసుకున్న అలీ తనలో ఒరిజినాలిటీని బయటపెట్టాడు.

నామినేషన్ లో మొదటి రౌండ్లలో అలీ - రాహుల్ - బాబా భాస్కర్ గెలిచారు. ఇక నాలుగో రౌండ్లో మొదట బెల్ కొట్టి బాబా భాస్కర్ - అలీ పోటీపడ్డారు. ఈ సందర్భంగా వీరికో టాస్క్ ఇచ్చారు. ఒక పెద్ద మట్టి బాక్సులో పువ్వులని నిలబెట్టాలి. ఈ క్రమంలో ఒకరి పూలని మరొకరు పీకి పారేయొచ్చు. అయితే టాస్క్ మొదలవ్వడమే ఇద్దరు పువ్వులని పెట్టేశారు. కానీ అలీ మొదట బాబా పువ్వులని పీకేశాడు.

దీంతో బాబా కూడా అలీ పూలని పీకే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ చేశారు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అలీ..బాబాని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. కావాలని తన తలతో గట్టిగా కొట్టడంతో బాబా ఎగిరి అవతలపడ్డారు. మొత్తానికి టాస్క్ లో అలీ కక్ష బాగా కనిపించింది.
Tags:    

Similar News