బిగ్ బాస్ పై ఓ సెక్షన్ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయ వాదులు అంగీకరించలేని షో ఇది. ఒక్కో సీజన్ లో ఒక్కొక్క సాంప్రదాయ వాది హైలైట్ అవుతున్నారు. ఈసారి నటి మాధవిలత `బిగ్ బాస్ సీజన్-5`పై విరుచుకుపడింది. ``ఏమయ్యా బిగ్ బాస్ .. ఏందయ్యా ఇది. ఆడ పిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగ కూడదు.. అంటూ ఓ ఆడపిల్లను మానసిక అత్యాచారం చేస్తున్నారు. వీకెండ్ లో నాగ్ మావ ఊ..కుంటూ వచ్చి వగలు పోతారు. చివరికి నాగార్జునని కూడా టీఆర్పీ కోసం దిగజార్చేస్తున్నారు. ఒక కన్న తల్లి మాటకి విలువ లేకుండా చేస్తున్నారు. సభ్య సమాజానికి బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? హగ్గులు ఇచ్చేస్తున్న వాడికే కప్ తగలబెట్టడండి.
అలాంటి వాడికే బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. ఇలాంటి వాడికి కిరీటం ఇస్తే బీబీ కొంప మీద ఫైర్ యాక్సిడెంట్ అయి సెట్ తగలబడిపోవడం ఖాయం. హగ్గులు..కిస్సులు..పక్కోడి పెళ్లాన్ని వాటేసుకోవడం.. స్నేహం ముసుగులో కామకలాపాలు చూడలేకపోతున్నాం. బీబీ చివరి ఎపిసోడ్ చూసి మీనిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే షో పై డైరెక్ట్ గా గా సుప్రీం కోర్టులో కేసు వేస్తా. హైకోర్టుల కూడా ఓ పిల్ పడేస్తాను. ఇది జోక్ కాదు. చాలా సీరియస్. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అన్ని అవమనాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలసి చూడలేని పరిస్థితి. అడల్ట్ షో చూస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగుతోంది. `బిగ్ బాస్ -5` వరస్ట్ షో`` అంటూ మండిపడింది.
బిగ్ బాస్ కి ఇలాంటివి కొత్త కాదు. గతంలో శ్రీరెడ్డి కూడా ఇలాగే ఫైర్ అయింది. అయితే ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రాకపోవడంతో కక్ష గట్టి వ్యవహరించిందని సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేసారు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ యాంకర్ కూడా ఇలాగే టార్గెట్ చేసింది. తాజాగా మాధవిలత వంతు వచ్చింది. మరి మాధవీలత ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి నిర్ణయానికి వస్తుందో చూడాలి. తనీష్ -రవిబాబు ల నచ్చావులే సినిమాతో హిట్టు కొట్టిన మాధవీలత వరుస చిత్రాల్లో నటించినా ఆ తర్వాత కెరీర్ పరంగా వెనకబడిన సంగతి తెలిసిందే. పలు వివాదాలు తన కెరీర్ ని డైలమాలోకి నెట్టాయన్న టాక్ వినిపించింది.