బుల్లితెర పై మోస్ట్ పాపులర్ రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' ముందు వరుసలో ఉంటుంది. తెలుగు టెలివిజన్ స్క్రీన్ మీదకు కూడా వచ్చిన ఈ షో.. తెలుగు ప్రేక్షకులకు అసలైన ఎంటర్టైన్మెంట్ ని పరిచయం చేసింది. 'స్టార్ మా' ఛానల్ లో ఎన్నో వివాదాల మధ్య ప్రసారమైన 'బిగ్ బాస్' తెలుగు షో.. ఇప్పటివరకు నాలుగు సీజన్లను విజయంతంగా పూర్తి చేసుకుంది. దీంతో అటు ప్రేక్షకుల్లోనే కాకుండా ఇటు సెలబ్రిటీలలో కూడా ఈ షో పై క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందరూ 'బిగ్ బాస్ - 5' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది 'బిగ్ బాస్ తెలుగు' సీజన్-4 కాస్త లేట్ గా ప్రారంభమైంది. పాండమిక్ సమయంలో ఇంటికే పరిమితమైన జనాలకు.. 106 రోజుల పాటు వినోదాన్ని అందించింది. సీజన్-5 అనుకున్న సమయానికే వస్తుంది అనుకుంటుండగా.. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి ఆలస్యమయ్యేలా చేసింది. అయితే ఇప్పటికే 'బిగ్ బాస్ 5' కోసం నిర్వాహకులు కంటెంస్టెంట్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈసారి సీజన్ తో మరింత వినోదాన్ని అందించడానికి 'స్టార్ మా' వాళ్ళు స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారట.
'బిగ్ బాస్ 5' కోసం హాస్యనటుడు ఆలీ ని కూడా నిర్వాహకులు సంప్రదిస్తున్నారట. కాకపోతే కంటెంస్టెంట్ గా కాకుండా.. స్టార్ కమెడియన్ తో స్పెషల్ ప్రోగ్రామ్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారట. హోస్ట్ గా సక్సెస్ అయిన అలీ.. 'బిగ్ బాస్' సీజన్ 5 హోస్ట్ తోపాటుగా స్టేజ్ మీద ఉండేలా చూస్తున్నారట. గతేడాది మాదిరిగానే వీకెండ్ లో స్పెషల్ గెస్టులను పిలిచి షో ను మరింత కలర్ ఫుల్ గా మార్చడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఇకపోతే తెలుగు 'బిగ్ బాస్ 1'కు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సీజన్ 2కు నేచులర్ స్టార్ నాని.. మూడు నాలుగు సీజన్లకు 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. గత రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన నాగ్ 'బిగ్ బాస్' సీజన్-5 కి కూడా హోస్టుగా ఉంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా రానా దగ్గుబాటి ఈ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని అంటున్నారు. 'స్టార్ మా' వారు హోస్ట్ గా ఎవరిని ఫైనల్ చేశారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.