బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ డే అంటే రచ్చ ఖాయం. ఈ వారం అంతకు మించి అన్నట్లుగా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ జరిగింది. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు ఈసారి ఏడుగురు అనే విషయం తెల్సిందే. ఎలిమినేషన్ నామినేషన్ విషయంలో రచ్చ జరుగబోతుందని ప్రోమోలోనే మా వాడు చూపించాడు. అయితే ప్రోమో జిమ్మిక్కులు తప్ప ఏమీ ఉండదు అనుకున్నారు. కాని ప్రోమోలో మించిన కంటెంట్ ఉందని పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థం అయ్యింది. 5 మచ్ ఫైర్ ను తాజా ఎపిసోడ్ లో చూడటం జరిగింది. సోమవారం ఎపిసోడ్ అంతా కూడా రచ్చ రచ్చ అయ్యింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చేసిన విమర్శలు గుప్పించిన విమర్శలు మామూలుగా లేవు. ఈసారి ఎక్కువ శాతం మంది ఉమాదేవిని టార్గెట్ చేయడం జరిగింది. దాంతో ఆమె సహనం కోల్పోయి మాట్లాడారు. సైలెంట్ గా ఉండే శ్వేత ఈసారి వైలెంట్ అయ్యింది.. ఆమె ఉగ్ర స్వరూపంకు అంతా కూడా షాక్ అయ్యి ఆమె తీరును విమర్శించారు.. ఆ తర్వాత ఆమె సారీ కూడా చెప్పింది. అలాగే నటరాజ్ మాస్టర్ కు కూడా కాస్త కోపం వచ్చేసింది. మొత్తానికి ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ దుమ్ము దుమ్ము అన్నట్లుగా రచ్చ జరిగింది.
ఈ వారం ఎలిమినేషన్ కు నామినేషన్ పక్రియ విభిన్నంగా జరిగింది. ఇంటి సభ్యులు అందరు కూడా రెండు సభ్యులుగా విడిపోయారు. ఒక జట్టుకు చెందిన సభ్యులను ఎదురుగా ఉన్న జట్టు సభ్యులు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ కాస్త కొత్తగా ఉంది. తాము నామినేట్ చేయాలనుకున్న వారి మొహానికి రంగు పూయాల్సి ఉంటుంది. కొందరు బొట్టు పెట్టినట్లుగా రంగు పూయగా కొందరు తమ కోపం అంతా కూడా కూడబలుక్కుని అన్నట్లుగా మొహం మొత్తం కూడా రంగు పూశారు. యానీ మాస్టర్ ను నామినేట్ చేసిన సమయంలో ఉమాదేవి రంగు మరీ ఎక్కువ పూసింది. యానీ మాస్టర్ కు అలా జరిగిందనే కోపంలో శ్వేత వర్మ మరీ రూడ్ గా ప్రవర్తించింది. ఆమె వ్యవహారం ఇంటి సభ్యులకు కూడా నచ్చలేదు. శ్వేత వర్మ లోబో మరియు హమీదాలపై రంగు మరీ దారుణంగా గుప్పింది. హమీద కళ్లలోకి రంగు పోయింది. ఫిజికల్ గా ఆమె ఎటాక్ చేసినంత పని చేసింది.
ఈ విషయం ఖచ్చితంగా శ్వేతకు ఎఫెక్ట్ అవ్వడం ఖాయం. ప్రియ గారు డైరెక్ట్ గానే నువ్వు చేసింది ఏంటీ అంటూ ప్రశ్నించింది. ఆ సమయంలో శ్వేత క్షమాపణలు చెప్పింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఈ వారంలో ఆమె ప్రవర్తన ఇలాగే ఉంటే ముందు ముందు ఆమెను ప్రేక్షకులు పక్కన పెట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఉమాదేవి ఎవరు తనను నామినేట్ చేసినా కూడా వారిపై మరీ దారుణంగా నోరు వేసుకుని పడిపోయింది. పచ్చి బూతులు మాట్లాడింది. రాసేందుకు కూడా వీలు పడని ఆ బూతులు ఇంటి సభ్యులకు కొందరికి కోపం తెప్పించగా కొందరు మాత్రం షాక్ అయ్యారు. ప్రోమోల షణ్ముఖ్ షాక్ అయిన షాట్ ఒకటి పండింది. అది ఉమాదేవి బూతు మాట అన్నప్పుడు అతడు ఇచ్చిన రియాక్షన్. ఉమాదేవిని షణ్ముఖ్ నామినేట్ చేసిన సమయంలో ఇచ్చిన రీజన్ కూడా అదే. అలాంటి బూతు పదాలు ఇక్కడ వాటం ఏమాత్రం సబబు కాదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఆశ్చర్యంగా లోబో వెళ్లి యాంకర్ రవిని నామినేట్ చేశాడు. మనం మంచి స్నేహితులం. కాని ఇక్కడ అలా వద్దు. నీ ఆట నువ్వు ఆడు నా ఆట నేను ఆడుతాను అంటూ వ్యాఖ్యలు చేసింది. ప్రియాంక ను కూడా ఈసారి కొందరు నామినేట్ చేశారు. ఆశ్చర్యంగా జెస్సీకి ఈసారి నామినేషన్ నుండి ఉపశమనం లభించింది. యానీ మాస్టర్ తీరును పలువురు తప్పుబట్టగా కొందరు సమర్థించారు. మొత్తంగా ఈ వారం లో ఎలిమినేషన్ కు మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. ప్రియా.. ఉమాదేవి.. కాజల్.. ప్రియాంక.. నటరాజ్ మాస్టర్.. లోబో.. యానీ మాస్టర్. ఈ ఏడుగురిలో అప్పుడే ఉమాదేవికి మూడింది అంటున్నారు. అయితే ఈ వారంలో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి ఆమె ఎలిమినేషన్ లేదా సేఫ్ అయ్యేది ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.