నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇజం.. ఈ నెల 21న థియేటర్లలోకి వచ్చేస్తోంది. పదేళ్ల కెరీర్ లో తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఒక స్టార్ డైరెక్టర్ తో చేస్తుండడం.. ఈ సినిమాకు అసలు సిసలైన అట్రాక్షన్.
తమ హీరోతో పూరీ జగన్నాథ్ ఏ కాన్సెప్ట్ ను తెరకెక్కించి ఉంటాడనే సందేహం నందమూరి అభిమానులను వెంటాడుతోంది. ఇండియాతో పాటు ఎక్కువగా స్పెయిన్ లో ఇజంను చిత్రీకరించారు. అసలు స్పెయిన్ నే ఎంచుకోవడానికి వెనక.. స్టోరీకి సంబంధించిన ఓ కీలకమైన పాయింట్ ఉంటుందట. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ డీలింగ్స్.. హవాలా రూట్.. ఆపరేషన్స్ లు స్పెయిన్ తో లింక్ అయి ఉంటాయని అంటున్నారు. బ్లాక్ మనీ డాన్ లతో కళ్యాణ్ రామ్ తలపడాల్సి రావడమే ఈ చిత్రంలో ప్రధానం.
అయితే జర్నలిస్ట్ పాత్రను బ్లాక్ మనీ డీలర్స్ తో లింక్ ఎలా అన్న పాయింట్ మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పూరి మూవీ కోసం కళ్యాణ్ రామ్ చాలానే మారిపోయాడు. తన యాక్టింగ్ నుంచి గెటప్ వరకూ ప్రతీ అంశంలోనూ కొత్తగా కనిపించబోతున్నాడు. ఇజం ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ చిత్రంపై నెలకొన్న ఆసక్తి చూస్తుంటే.. కళ్యాణ్ రామ్-పూరీల కాంబో పెద్ద హిట్ నే కొట్టేట్టుగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/