కోల్ క‌త్తా చిత్రోత్స‌వాల్లో బాలీవుడ్ తార‌లు!

Update: 2022-12-12 06:30 GMT
ఇటీవ‌లే గోవాలో 53వ  అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బాల‌వుడ్ తార‌ల‌తో పాటు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ వేదిక‌పై మెరిసారు. చల‌న చిత్రోత్స‌వాల‌కు భార‌త్ లో ఆద‌ర‌ణ అంతంత మాత్రంగానే ఉన్న‌  నేప‌థ్యంలో ఈసారి వేడుక‌ల్ని కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌డంతో వేదిక‌పై తార‌లంతా మెరిసారు.

ప్ర‌పంచ దేశాలే భార‌త్ వైపు చూసేలా ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని మోదీ ప్ర‌భుత్వం సైతం భావిస్తోంది. దీనిలో భాగంగానే భార‌త‌దేశంలో అన్ని ప‌రిశ్ర‌మ‌లో న‌టులు ఇలాంటి వేడుక‌ల్లో పాల్గొనాల‌ని సూచించారు. కేంద్ర తరుపున ప‌లువురు మంత్రులు..అధికారులు పాల్గొన్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా డిసెంబ‌ర్ 15 నుంచి22 వ‌ర‌కూ  కోల్ క‌త్తా ప్ర‌తిష్టాత్మ‌క కోల్ క‌త్తా  ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ పెస్టివ‌ల్ ( కేఐఎఫ్ ఎఫ్) జ‌ర‌గ‌నుంది.

దీనికి  బాలీవుడ్ క‌థానాయ‌క‌లు   అమితాబ‌చ్చ‌న్..షారుక్ ఖాన్  విషిష్ట గౌర‌వ అతిధులుగా  హాజ‌రు కానున్నారు.  ఈ వేడుక‌లో 57 దేశాల‌కు చెందిన 1078 ద‌ర‌ఖాస్తులు రాగా..42 దేశాల‌కు చెందిన 183 చిత్రాలు ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపిక‌య్యాయి. జ‌యాబ‌చ్చ‌న్..రాణీ ముఖ‌ర్జీ...కుమార్ సానూ..మ‌హేష్ భ‌ట్...శ‌తృఘ్ను సిన్హా త‌దిత‌రులు  ఈ వేడుక‌లో పాల్గొంటారు.

అలాగే పాన్ ఇండియా లో  ఫేమ‌స్ అవుతోన్న తెలుగు..క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా భాగ‌మ‌వ్వ‌డానికి అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కొంద‌రి సినీ ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అందిన‌ట్లు తెలిసింది. మ‌రి ఇందులో వాస్త‌వం తెలియాల్సి ఉంది. 2020-21 సంవ‌త్స‌రాల్లో క‌రోనా కార‌ణంగా ఈ వేడుక‌లు నిర్వ‌హించ‌లేదు. దీంతో ఈసారి వేడుక‌లు మ‌రింత వైభవంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర‌-రాష్ర్ట ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించే  వేడుక‌లు కావ‌డంతో?  భార‌త్ లో సంచ‌న‌లం సృష్టించిన అన్ని భాషల చిత్రాలు స్పెష‌ల్  స్ర్కీనింగ్ ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. దీనిలో భాగంగా ఆస్కార్ బ‌రిలో నిలిచిన చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న ఉండొచ్చ‌ని తెలుస్తోంది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News