న‌టి శ‌శిక‌ళ క‌న్నుమూత‌!

Update: 2021-04-04 16:42 GMT
బాలీవుడ్ సీనియ‌ర్‌ న‌టీమ‌ణి శ‌శిక‌ళ ఓం ప్ర‌కాష్ క‌న్నుమూశారు. ముంబైలోని ఆమె నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విష‌య‌మై కుటుంబ స‌భ్యుల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం 88వ ప‌డిలో ఉన్న ఆమె మృతికి కార‌ణం కూడా తెలియాల్సి ఉంది.

1950వ ద‌శ‌కం నుంచి 2004 వ‌ర‌కు ఎన్నో చిత్రాల్లో ఆమె న‌టించారు. అదేవిధంగా.. బుల్లితెర‌పైనా త‌న‌దైన  ముద్ర‌వేశారు. బాద్ షా సినిమాలో షారూక్ ఖాన్ త‌ల్లిగా, ముజ్ సే షాదీ క‌రోగి మూవీలో స‌ల్మాన్ ఖాన్ నాన‌మ్మ‌గా క‌నిపించి అల‌రించారు శ‌శిక‌ళ‌.

భార‌తీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవ‌ల‌కు గానూ.. కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. 2007లో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. షోలాపూర్ లోని మ‌హారాష్ట్రియ‌న్ కుటుంబంలో జ‌న్మించిన ఆమె.. అంచెలంచెలుగా ఎదిగారు. కొల‌బాలోని చ‌ర్చిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News