డెంగ్యూ జ్వరాన్ని తట్టుకుని 8 ప్యాక్‌తో టైగర్
అయితే అతడు ఇటీవల డెంగ్యూ వ్యాధితో బాధపడ్డాడు. హైఫీవర్, తలనొప్పిని భరించాడు. అయినా అతడి ఎనిమిది పలకల రూపానికి వచ్చిన నష్టమేమీ లేదు.
డెంగ్యూ జ్వరం అంటే ఆల్మోస్ట్ చావు అంచులవరకూ వెళ్లి రావడమే. సరియైన అవగాహన, మెడిసిన్ సదుపాయం లేని కాలంలో చాలామంది ప్రాణాలను డెంగ్యూ బలిగొంది. దోమకాటుతో వచ్చే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది. హై ఫీవర్.. భరించలేని తలనొప్పి.. నిస్సత్తువతో విపరీతంగా బాధిస్తుంది. డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడంతో సమస్య తీవ్రతరమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. నెలల పాటు బాధించే ప్రమాదకర రుగ్మత ఇది. పూర్తిగా తగ్గిన తర్వాత కూడా కోలుకోవడానికి చాలా రోజుల సమయం పడుతుంది.
ఇలాంటి ఒక గండం నుంచి గట్టెక్కాడు టైగర్ ష్రాఫ్. ఈ బాలీవుడ్ యువహీరో ఎలాంటి నిబద్ధత కలిగిన ఫిట్నెస్ ఔత్సాహికుడో తెలిసిందే. మెలి తిరిగిన కండలు.. తీరైన దేహశిరులు.. 8 ప్యాక్ యాబ్స్‌తో అతడు కట్టిపడేస్తాడు. జిమ్ లో నిరంతరం గంటల తరబడి శ్రమిస్తాడు టైగర్. చాలాసార్లు జిమ్ నుంచి అతడి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. టీవీ చానెళ్ల లైవ్ కార్యక్రమంలో అతడి స్టంట్స్, సాహసాలు, షర్ట్ లెస్ షోలు ఆశ్చర్యపరుస్తాయి. పెద్ద తెరపై జాన్ ర్యాంబోని తలపించే సాహస విన్యాసాలతో తన అభిమానులను అలరిస్తుంటాడు.
అయితే అతడు ఇటీవల డెంగ్యూ వ్యాధితో బాధపడ్డాడు. హైఫీవర్, తలనొప్పిని భరించాడు. అయినా అతడి ఎనిమిది పలకల రూపానికి వచ్చిన నష్టమేమీ లేదు. మెలితిరిగిన కండలు, తీరైన రూపానికి డోఖా లేదు. అయితే టైగర్ ష్రాఫ్ డెంగ్యూ నుండి కోలుకున్న తర్వాత అలసిపోయినట్లు కనిపించాడు. చెదిరిన క్రాఫ్ తో కొంత గందరగోళంగా ఉన్నాడు. తిరిగి అతడు మునుపటిలా ఉత్సాహంగా ఎనర్జిటిక్ గా మారాలంటే దానికి కొంత సమయం పడుతుంది. అతడు కోలుకున్న తర్వాత తన ఫోటోని పోస్ట్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాసాడు. ''నేను డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న ఒక రోజు తర్వాత ఈ ఫోటో తీసుకున్నాను'' అని రాసాడు.
8ప్యాక్.. పొంగిన నరాలతో ముంజేతులు, కండరాల కండరపుష్టితో టైగర్ సిగ్నేచర్ టోన్డ్ ఫిజిక్ అలానే ఉంది. అధిక జ్వరంతో కూడిన విపరీతమైన డెంగ్యూతో పోరాడిన తర్వాత అతడి ప్యాక్డ్ బాడీ బిల్డింగ్ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. శరీరాకృతిని కాపాడుకోవడంలో టైగర్ తిరుగులేని క్రమశిక్షణ ఈ రూపంలో కనిపిస్తోంది.
టైగర్ ష్రాఫ్ కి 2024 అంతగా కలిసి రాలేదు. అతడు అక్షయ్ కుమార్‌తో కలిసి 'బడే మియాన్ చోటే మియాన్'లో నటించాడు. కానీ ఈ సినిమా డిజాస్టరైంది. సంవత్సరం చివరిలో వచ్చిన 'సింగం ఎగైన్' మల్టీస్టారర్ కూడా అతడిని ఆదుకోలేకపోయింది. టైగర్ ప్రతిష్ఠాత్మక ఫ్రాంఛైజీ చిత్రం 'బాఘీ 4' సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది.