నితిన్ కోసం మరో స్టార్..!

Update: 2023-06-26 19:00 GMT
భీష్మ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ హీరో కాంబో నితిన్, వెంకీ కుడుముల కలిసి మళ్లీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భీష్మ హీరోయిన్ రష్మిక మందన్ననే ఫిమేల్ లీడ్ గా తీసుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.

ఇంతకీ ఏంటా అప్డేట్ అంటే నితిన్ తో పాటు ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారట. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో బాలీవుడ్ హీరో కనిపిస్తాడని టాక్.

ఈమధ్య తెలుగు సినిమాల్లో ఏదో ఒక పాత్రలో హిందీ నటులను పెట్టి సినిమాను హిందీలో కూడా మార్కెట్ అయ్యేలా చూస్తున్నారు. మరి వెంకీ కూడా అదే ప్లానింగ్ తో ఉన్నాడా లేదా అన్నది తెలియదు కానీ వెంకీ, నితిన్ కాంబో మరోసారి ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

లవ్ స్టోరీనే కానీ అందులో ట్విస్ట్ లు బాగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నాడట వెంకీ కుడుముల. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రష్ చూసి చిత్ర యూనిట్ ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉన్నారని తెలుస్తుంది.

నితిన్, వెంకీ, రష్మిక ఈ ట్రియో మళ్లీ భీష్మా మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. నాగ శౌర్య ఛలోతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఛలో కథలో నాగ శౌర్య ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉందని టాక్ వచ్చింది. ఈ క్రమంలో నితిన్ తో చేసిన భీష్మతో కూడా హిట్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు వెంకీ కుడుముల.

ఇక థర్డ్ సినిమా కూడా పక్కా హిట్ కొడుతున్నాం అన్న కాన్ఫిడెంట్ తోనే ఉన్నారు. నితిన్ కి మాచర్ల ఇచ్చిన షాక్ వల్ల అర్జెంట్ గా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. వెంకీతో సినిమాతో పాటుగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా కూడా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలతో నితిన్ మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. నితిన్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో బాగా కనిపెట్టిన దర్శకుడు వెంకీ భీష్మ ఫార్ములాతోనే ఈ సినిమా కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వెంకీతో నితిన్ ఈ సినిమా కూడా హిట్ పడితే ఈ కాంబో రిపీటెడ్ సినిమాలు చేస్తారని చెప్పొచ్చు.

Similar News