బాలీవుడ్ బాద్‌షా.. జావాన్?

Update: 2022-06-02 09:34 GMT
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ చూసి చాలా కాలమైంది. వరుస అపజయాలు ఎదురవ్వడంతో వెండితెరకు గతంలో ఎప్పుడూ లేనంతగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ సారి ఎలాగైనా పఠాన్ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అనుకుంటున్నాడు.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే షారుక్ ఖాన్ ఎంతో ఆలోచించి ఓకే చేసిన అట్లీ ప్రాజెక్టుపై కూడా త్వరలోనే మరో క్లారిటీ రానున్నట్లు సమాచారం. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాబోయే కొత్త చిత్రంపై ఇప్పటికే అనేక రకాల టైటిల్స్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కు కురిశాయి.

మొదట సంఖి టైటిల్ కూడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు 'జవాన్' అనే మరొక కొత్త టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రీ టీజర్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారట. నిమిషం పైగా ఉండే ఆ టీజర్ లో కొన్ని డైలాగ్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ షారుక్ తో సినిమా చేయాలని గత రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక మొత్తానికి ఏడాది పాటు అతను స్క్రిప్టుపైనే కూర్చుని ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. ఇక జవాన్ సినిమా కేవలం హిందీ లోనే కాకుండా తమిళం తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

మరోవైపు షారుక్ ఖాన్ తన ఫేవరెట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డంకి అనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. మరి ఈ సినిమాలతో బాలీవుడ్ బాద్షా ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News