ఇంకా థియేటర్లలో సినిమా రిలీజ్ కాకముందే ఆన్ లైన్ లో పైరసీ లింకులు దర్శనమిస్తే ఏ నిర్మాతకు అయినా ఆ టెన్షన్ ఎలా ఉంటుందో ఊహించగలం. అలా టెన్షన్ పెట్టడంలో సిద్ధహస్తులు తమిళ్ రాకర్స్ మాఫియా. ఈ ముఠా అరాచకాలకు దశాబ్ధాల కాలంగా ఎదురే లేకుండా పోయింది. తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు అయిన విశాల్ సైతం వీళ్ల అరాచకాల్ని ఆపలేకపోయాడు. పోరాడి విసిగిపోయారంతా. రిలీజయ్యే ప్రతి సినిమాని రిలీజ్ డే రోజునే ఆన్ లైన్ పైరసీలో లీక్ చేసి తమిళ్ రాకర్స్ ఆడుకున్నారు.
ఇది వీళ్లకు నిత్యకృత్యం. తాజాగా తళా అజిత్ ప్రధాన పాత్రలో హెచ్.వినోద్ దర్శకుడిగా బోని కపూర్ నిర్మించిన `నేర్కొండ పార్వాయ్` చిత్రాన్ని తమిళ్ రాకర్స్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారన్న సమాచారం అందింది. దీంతో ఆ ప్రమాదం తలెత్తక ముందే నిర్మాత బోనీకపూర్ తమిళ్ రాకర్స్ పై కోర్టుకెక్కారు. తమిళరాకర్స్ చరిత్ర గురించి స్పష్టంగా తెలిసిన బోనీ ఎంతో ముందు జాగ్రత్తగా ఈ పని చేశారట. అయితే ఆయన ఎంతవరకూ కంట్రోల్ చేయగలరు? అన్నది సస్పెన్స్ గా మారింది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` రీమేక్ గా తెరకెక్కిన `నేర్కొండ పార్వాయ్` కి సంబంధించిన కొన్ని లీక్డ్ సీన్లు బోనీని వేరొక రకంగా టెన్షన్ పెడుతున్నాయి. అక్కడక్కడా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్ని మొబైల్స్ లో రికార్డ్ చేసి ఇప్పటికే ఆన్ లైన్ లో పెట్టారు. దీంతో వీటి లింకులన్నీ తీయించే టెన్షన్ లో ఉన్నారట. మరోవైపు అజిత్ చిత్రాన్ని బోనీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అంతే భారీగా రిలీజ్ చేశారు. సింగపూర్ లో ఓ ప్రివ్యూ వేశారు. అలాగే చెన్నయ్ లోనూ మీడియా ప్రీమియర్ సహా స్పెషల్ ప్రీమియర్లు వేశారు. వీటి నుంచి ఎవరో ఇలా కొన్ని క్లిప్ లు ఎవరికీ తెలీకుండా కాపీ చేసి లీక్ చేయడంతో బోనీకి టెన్షన్ పట్టుకుందట. అసలు పైరసీ అన్నదే లేకుండా చేయాలని ఆయన తపిస్తున్నారట. అయితే ఎందరు ప్రయత్నించినా ఇలాంటివి ఆగడం లేదు. ఆకతాయి ఆగడాలతో పాటు తమిళ్ రాకర్స్ మాఫియాని అస్సలు ఆపలేకపోతున్నారు. నేడు రిలీజ్ సందర్భంగా ఈ సాయంత్రం లోపే నేర్కొండ పార్వాయ్ చిత్రాన్ని తమిళ్ రాకర్స్ లీక్ చేసే వీలుంది. మరి డ్యామేజ్ ని ఎంతవరకూ ఆపగలరో చూడాలి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ ఒరిజినల్ లో తాప్సీ పోషించిన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.