వారాంతం ముగిసింది. బాక్సాఫీస్ టాప్ 5 లిస్ట్ వచ్చేసింది. టిక్కెట్స్ కౌంటర్ల దగ్గర ఎవరెంత వసూలు చేస్తున్నారు.. ఏ రేంజులో ఉన్నారో తెలిసింది. సమ్మర్ సీజన్ లో అన్ని రోజులు సెలవులే కాబట్టి.. ప్రతీ రోజు సాధించే కలెక్షన్స్ ఇంపార్టెంటే. కానీ వీకెండ్ లో అయితే.. అంతకు రెండింతలు వసూళ్లు సాధ్యమవుతాయి. అందుకే ఏ సినిమాకైనా వారాంతం వసూళ్ల లెక్కలు చాలా ముఖ్యం. గత శుక్రవారం రిలీజ్ అయిన సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం.. ఈ వీకెండ్ లో టాప్ ప్లేస్ లో నిలవడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. మహేష్ మూవీనే ఆ ప్లేస్ లో ఉండాలి, ఉంది కూడా.
బ్రహ్మోత్సవం: వీకెండ్ మూడు రోజుల్లోను కలిపి బ్రహ్మోత్సవం ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల రూపాయల షుమారు వసూళ్లు సాధించే ఛాన్సుంది. నెంబర్ పరంగా ఎక్కువే కానీ.. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ ప్రకారం.. ఈ కలెక్షన్ ను మొదటి రోజు సాధించేస్తుందని అంచనా వేశారు. కానీ మూవీకి బ్యాడ్ టాక్ రావడంతో.. అది సాధ్యం కాలేదు.
సుప్రీమ్: బ్రహ్మోత్సవం తర్వాత రెండో స్థానంలో సాయిధరం తేజ్ మూవీ సుప్రీమ్ నిలిచింది. కామెడీతో పాటు మాస్ ఆడియన్స్ కావాల్సిన కంటెంట్ ఉండడంతో.. రెండో స్థానంలో నిలిచాడు సుప్రీమ్. పైగా 20 కోట్ల షేర్ మార్కును కూడా దాటేశాడు.
సరైనోడు: ఇక ఐదో వారంలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు మూడో స్థానంలో నిలిచింది. కంప్లీట్ మాస్ మూవీ అయిన సరైనోడుకి.. ఇప్పటికీ బీ - సీ సెంటర్లలో ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. మరో రెండు 80 కోట్ల షేర్ ను టచ్ చేసే ఛాన్సుంది.
24: సూర్య నటించి సైఫై మూవీ 24 నాలుగో స్థానంలో నిలిచింది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి 24కు ప్రజాదరణ పెరుగుతోంది. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉండడంతో.. లాంగ్ రన్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ టైమ్ గేమ్ కు టాలీవుడ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
బిచ్చగాడు: ఇతర డైరెక్ట్ సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడం, ఒకటీ అరా సెంటర్స్ లో ఉన్న చిత్రాలను కూడా బ్రహ్మోత్సవం కోసం ఖాళీ చేయడంతో.. తమిళ్ డబ్బింగ్ చిత్రమైన బిచ్చగాడు టాప్ 5లోకి చేరిపోయింది. మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్స్ తో ఐదో స్థానంలో నిలిచింది బిచ్చగాడు.