టికెట్ కౌంటర్: టాక్ ఎలా ఉన్నా టాప్ లో..

Update: 2016-07-18 17:30 GMT
ఈ వీకెండ్ లో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ ని కళకళలాడించే సినిమాలేమీ రాలేదు. వచ్చినవాటికి టాక్ గొప్పగా లేదు. దీంతో ఉన్న సినిమాల్లో సెల్ఫీరాజానే కాస్త బెటర్ అనిపిచే కలెక్షన్స్ దక్కించుకుంది.

1. సెల్ఫీరాజా: ఈ వారం సెల్ఫీరాజానే టాప్ లో నిలిచాడు. స్పూఫ్ లు లేకుండా సినిమా తీశామని అల్లరి నరేష్ సహా మేకర్స్ కబుర్లు చెప్పినా.. సినిమాలో కంటెంట్ యావరేజ్ కూడా ప్రేక్షకులకు అనిపించలేదు. దీంతో మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ వరకే చెప్పుకోదగ్గవిగా అనుకోవాలి.

2. నాయకి: త్రిష నటించిన నాయకి కూడా ఈ వారం రిలీజే. అయితే.. పోస్టర్లలో ఉన్న కంటెంట్ క్వాలిటీ సినిమాలో కనిపించకపోవడం.. లీడ్ రోల్ చేసిన ప్రచారం చేయకపోవడంతో.. సినిమా నిరాదరణకు గురైంది. మరోవైపు హారర్ కామెడీ అని చెప్పినా.. అటు కామెడీ.. ఇటు హారర్ ఏదీ లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు.

3. సుల్తాన్: గతవారం టాప్ లో నిలిచిన సుల్తాన్ మూవీకి.. రంజాన్ హాలిడే సీజన్ ముగిశాక కలెక్షన్స్ తగ్గిపోయాయి. అయితే వీకెండ్ లో మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. నేషనల్ వైడ్ గా అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా 250కోట్ల కలెక్షన్స్ రాబట్టేశాడు సుల్తాన్.

4. బిచ్చగాడు: బిచ్చగాడు మూవీకి 25 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తెలుగు జనాలకు తెలిసిన మొహం ఒక్కటి కూడా లేకపోయినా.. రిలీజ్ అయిన పది వారాలు గడిచినా ఇంకా టాప్ 5లో కంటిన్యూ అవుతున్నాడు బిచ్చగాడు.

5.జెంటిల్మన్: ఈ వీకెండ్ లో నాని జెంటిల్మన్ టాప్ 5మూవీగా నిలిచింది. ఈ థ్రిల్లర్ మూవీని కేవలం తన వెర్సటైల్ ఇమేజ్ తో 20 కోట్ల కలెక్షన్స్ రాబట్టే మూవీగా చేసేశాడు నాని.

వచ్చే వారం విడుదల కానున్న కబాలితో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు మారతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags:    

Similar News