`విన‌య విధేయ రామ` అల‌ను తాకే వేళ ఇదీ

Update: 2021-07-05 00:30 GMT
రామ్ చ‌ర‌ణ్‌- బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `విన‌య విధేయ రామ` ఆ సంవ‌త్స‌రం ఇండ‌స్ట్రీ చెత్త సినిమాల్లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా ఎలివేష‌న్ ల‌వ్ అంశాల‌తో పాటు ఊర మాస్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ఈ సినిమాని క్లాసిక్ గా తీయాల‌ని భావించిన బోయ‌పాటి కొన్ని యాక్ష‌న్ సీన్స్ లో మ‌రీ అతి చేయ‌డంతో దానిపై మెగాభిమానులే తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఇక ఆ సినిమా యాక్ష‌న్ ఎపిసోడ్స్ పై మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. బుల్లితెర‌పై వ‌చ్చినా అక్క‌డా పెద‌వి విరుపులే.

అయితే ఈ సినిమా టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పోటీప‌డ‌డం తాజాగా ఆస‌క్తిని క‌లిగించింది. అల వైకుంఠపురములో ఇటీవల నాలుగ‌వ టెలికాస్ట్ 4.98 టీఆర్పీని ద‌క్కించుకోగా.. వినయ విధేయ‌ రామ తన 19వ టెలికాస్ట్ లో 4.96 టిఆర్ పిని అందుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ రెండిటికి సంబంధించిన నంబ‌ర్లు చూస్తే వీక్షకుల సంఖ్య భారీగా పడిపోయార‌ని అర్థ‌మ‌వుతోంది.

అల వైకుంఠ‌పురములో రికార్డు స్థాయిలో 29.4 టి.ఆర్‌.పితో ప్రారంభమైంది. వినయ విధేయ‌ రామ ప్రీమియర్ లో ప్ర‌తిసారీ 10 టి.ఆర్.పి (7.9 కచ్చితంగా) కంటే తక్కువ నమోదు అయ్యింది. అయితే బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో ని డిజిట‌ల్లో అధికంగా వీక్షించ‌డం వ‌ల్ల‌నే ప్ర‌క‌ట‌న‌ల‌తో విసిగించే టీవీ ప్రీమియ‌ర్ ని జ‌నం స్కిప్ కొట్టి ఉండొచ్చ‌ని అంచ‌నా వేయొచ్చు. బోయ‌పాటి తో పోలిస్తే బుల్లితెర టీఆర్పీల్లో త్రివిక్ర‌మ్ కి ఉండే క్రేజు వేరు. అస‌లు బుల్లితెర‌పై ఆయ‌న సినిమాల్లో టీఆర్పీ గెలుచుకోని సినిమా లేనేలేదు.
Tags:    

Similar News