టాలీవుడ్ ని నాలుగు దశాబ్ధాలుగా ఏల్తున్నాడు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. లెక్చరర్ టర్న్‌డ్ యాక్టర్ గా పరిశ్రమలో తిరుగేలేని స్థాయిని అందుకున్నారు. ప్రపంచంలోనే 1000 సినిమాల క్లబ్ లో చేరుతున్న ఏకైక కమెడియన్ ఆయనే. ఒక్కో కాల్షీట్ కి రూ.5లక్షలు అందుకునేంత స్టార్ డమ్ ఉన్న కమెడియన్ గా బ్రహ్మీ టాలీవుడ్ సర్కిల్స్ లో పాపులర్. అయితే ఇంతకాలానికి అతడి కెరీర్ డైలమాలోకి వెళుతోందా? అంటే అవుననే ముచ్చటించుకుంటున్నారు ఫిలింనగర్ లో.
ఇప్పుడొస్తున్న దర్శకనిర్మాతలంతా బ్రహ్మీకి ఆల్టర్నేట్ వెతుకుతున్నారు. పారితోషికం వైజ్, ఇటీవలి కాలంలో మారిన ట్రెండ్ దృష్ట్యా నవతరం లో బెస్ట్ కమెడియన్స్ ని ఎంపిక చేసుకునేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఆల్టర్నేట్ గా పృథ్వీ - శ్రీనివాస్ రెడ్డి - సప్తగిరి వంటి కమెడియన్లు తెరపైకి దూసుకొచ్చారు. వాళ్లకి అవకాశం ఇచ్చి ప్రోత్సహించేందుకే నవతరం డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇటీవలి కాలంలో బ్రహ్మీ కామెడీలో పస తగ్గిందన్న వాదన తెరపైకి వచ్చింది. ఢీ - రెడీ - రేసుగుర్రం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో బ్రహ్మీ సోలో పెర్ఫామెన్స్ తో ఇరగదీశాడు. ఆ సినిమాలకు బ్రహ్మీ ప్లస్. కానీ ఇటీవలి కాలంలో బ్రూస్ లీ - షేర్ వంటి సినిమాల్లో బ్రహ్మీ కామెడీ ఎక్కడా ఆకట్టుకోలేదు. ఈ ఫెయిల్యూర్స్ దృష్ట్యా అతడిని ఓ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పించారని వార్తలొస్తున్నాయి.
మొదట బ్రహ్మీనే అనుకున్నా... ఆ తర్వాత ఆల్టర్నేట్ ఆప్షన్స్ కే వెళ్లారని తెలుస్తోంది. పైగా ఆయనకు రోజుకు 5 లక్షలు ఇవ్వాలంటే కష్టం అంటున్నారు నిర్మాతలు. అందుకే ఈ మధ్యనే ఓ రెండు పెద్ద సినిమాల్లోనుండి బ్రహ్మీని ఆఖరి నిమిషంలో తప్పించారట. సో.. ఆయన రేటు తగ్గిస్తే.. ఏమైనా వర్కవుట్ అవుతుందేమో. ఇన్ కేస్.. బ్రహ్మీ నటించిన ఓ రెండు సినిమాలు హిట్టయితే మళ్లీ ఆయనే కింగ్.