బ్రహ్మి క్యారెక్టర్.. బాలయ్య వీడియోనే స్ఫూర్తి

Update: 2015-12-14 11:30 GMT
యూట్యూబులోకి వెళ్లి టాలీవుడ్ స్టార్స్ స్పూఫ్ వీడియోలని కొడితే ఫన్నీ ఫన్నీ వీడియోలు చాలా వస్తాయి. అందులో రజినీకాంత్, బాలయ్య మీద పేరడీ వీడియోలకు లెక్కే ఉండదు. కొన్ని సరదాగా ఉంటాయి. ఇంకొన్ని అతిగా అనిపిస్తాయి. వాటిలో రజినీకాంత్ - బాలయ్యల హీరోయిజం మీద సరదాగా చేసిన ఓ వీడియో చాలా ఫన్నీగా అనిపిస్తుంది.

అందులో ఓ కుర్రాడు వచ్చి ఓ తమిళ అబ్బాయిని ‘బావున్నావా’ అని అడుగుతాడు. దానికతను కోప్పడి పక్కనున్నోడి ఒంటి మీది నుంచి అగ్గిపుల్లతో నిప్పు పుట్టించి సిగరెట్ వెలిగించుకుని ‘సూపర్ స్టార్’ అంటాడు. దానికి తెలుగు కుర్రాడు కౌంటర్‌ గా కొంచెం దూరం వెళ్లి ‘జై బాలయ్య’ అని ఆకాశానికి మొక్కి మెరుపులోంచి సిగరెట్ అంటించుకుంటాడు. ఈ వీడియోను చాలామంది చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. ఇప్పుడీ వీడియో స్ఫూర్తితో ‘సౌఖ్యం’ సినిమాలో ఓ సన్నివేశం అల్లినట్లున్నారు.

‘సౌఖ్యం’ ట్రైలర్ లో బ్రహ్మి పాత్ర ఇలాగే ఆకాశపు మెరుపులోంచి సిగరెట్ అంటించుకునే సన్నివేశం కనిపించింది. అంతే కాదు.. ‘లెజెండ్’ సినిమా ఇంటర్వెల్ సీన్ లో బాలయ్య కాలి అదిలింపుతో భూమి దద్దరిల్లే సీన్ కూడా పేరడీ చేసినట్లున్నారు. ‘సౌఖ్యం’ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి సైతం బాలయ్య ఫ్యానే కాబట్టి.. ఇందులో బాలయ్యపై పేరడీని సరదాగానే తీసి ఉంటాడనడంలో సందేహమేమీ లేదు కాబట్టి ఇందులో నందమూరి అభిమానులు ఫీలవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు.
Full View

Tags:    

Similar News