లైగర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది అనన్య పాండే. ఉత్తరాది పరిశ్రమతో పాటు దక్షిణాది లోనూ ఈ అమ్మడికి భారీగా పాపులారిటీ పెరిగింది. సోషల్ మీడియాల్లోనూ అనన్యకు ఉన్న అసాధారణ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు.
ఇక లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించే భామగా అనన్యకు యూత్ లో అంతకంతకు ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఇండీ కిడ్ స్టైల్స్ ని పరిచయం చేస్తున్న భామగా చర్చల్లోకొస్తోంది. నేటితరం ఫ్యాషన్ అనుకరణలో ఇండీ కిడ్ బ్యూటీ చెప్పుకోదగ్గది. ఇది వ్యక్తిత్వం స్వాతంత్య్రం పై ఆధారపడి ఉంటుంది. ఇండీ కిడ్ అనేది ప్రకాశవంతమైన రంగురంగుల శైలి. సాధారణంగా భారీ జీన్స్.. పెద్ద హూడీలు.. చిన్న చొక్కాలు ధరించడం ఒక ట్రెండ్. టిక్ టాక్ ద్వారా ఇండీ బ్యూటీ బాగా పాపులరైంది.
అందమైన బకెట్ టోపీలు ఇటీవల ఫ్యాషన్ ప్రపంచంలోకి తిరిగి వచ్చాయి. సెలబ్రిటీల నుండి మోడల్స్ వరకు ప్రతి ఒక్కరికీ బకెట్ టోపీ ధరిస్తున్నారు. బకెట్ టోపీ లేకుండా ఇండీ కిడ్ లుక్ నిజంగా పూర్తి కాలేదు. 2000 ల ప్రారంభంలో ఇవి భారీ ట్రెండ్ గా మారాయి. ఇప్పుడు మరోసారి తమ స్వంత ఆధునిక మార్పులతో తిరిగి అదే ఫ్యాషన్ ని తీసుకొచ్చారు. పాఠశాల యూనిఫాంలో భాగమైన స్కర్టులను గుర్తు చేసుకుంటే.. అది ఇప్పుడు ఇండీ లో లేటెస్ట్ ఫ్యాషన్. పాఠశాల నుండి స్ఫూర్తితో టెన్నిస్ స్కర్టులను ఎంపిక చేసుకోవడమే ఇండీ స్టైల్ లో భాగంగా మారింది. ఎంచుకునే దుస్తులతో పాటు తలకట్టు విధానం యాక్సెసరీస్ ప్రతిదీ ఇండీ స్టయిల్ ని ఫాలో చేయడంలో అనన్య కు చాలా ప్రత్యేకత ఉందని యూత్ భావిస్తోంది.