ప్రముఖ నిర్మాత బన్నీ బాస్ ను సునీత బోయ అనే మహిళ గత మూడేళ్లుగా మానసిక వేదనకు గురి చేస్తోంది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెట్టిన సునీత.. ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 45 లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సినీ నటిగా చెప్పుకునే సునీత బోయ ఇంతముందు మలక్ పేట ప్రాంతంలో ఫ్రూట్స్ బిజినెస్ చేసేది. అదే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేది. ఆ మధ్య నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని మోసం చేశాడంటూ ఆరోపించి పలుమార్లు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అంతేకాదు పలుమార్లు జూబ్లీహిల్స్ రోడ్ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి హంగామా చేయగా.. సునీత పై పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్ లు కూడా నమోదు చేశారు. అయితే సునీత మానసిక పరిస్థితి బాగా లేదని తేలడంతో.. ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ కు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు.
చికిత్స తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా సునీత బన్నీ వాస్ ను లక్ష్యంగా చేసుకొని వేధించడం మొదలు పెట్టింది. జూన్ రెండో వారంలో బన్నీ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకుంటాను అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో జీఏ2 మేనేజర్ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం బన్నీ ఆఫీస్ కి సునీత వెళ్తుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. సునీత మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు సునీతను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.