బన్నీ.. వాసు.. ఇద్దరు ఒకటే మాట..!

Update: 2022-11-07 06:55 GMT
అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి అలరించారు. తమ్ముడి మొదటి కమర్షియల్ సక్సెస్ ని తమ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తుందని చెప్పారు అల్లు అర్జున్. సినిమా కోసం పనిచేసిన వారందరికి కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాదు సినిమాని హిట్ చేసి తమ కుటుంబానికి ఒక గిఫ్ట్ ఇచ్చారని ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. ఈ వేడుకలో బన్నీ వాసు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్.

అంతకుముందే బన్నీ వాసు స్పీచ్ తో అదరగొట్టాడు. శిరీష్ హీరోగా అవుతానని చెప్పగానే వాళ్ల అమ్మ గారు కంగారు పడ్డారని.. ఇప్పటికీ తనని కలిసినప్పుడు శిరీష్ గురించి ఆలోచిస్తున్నావా అంటారని చెప్పారు. శిరీష్ హీరో అయ్యాడు కాబట్టి తను ఈ ప్లేస్ లో ఉన్నానని.. అసలు ఈ ప్లేస్ శిరీష్ ది అని అల్లు అరవింద్ శిరీష్ ని నిర్మాతగా చేద్దామని అనుకున్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాసు.

ఇక అల్లు అర్జున్ తాను ఒకటే అని.. అల్లు అర్జున్ ఎంత సంపాదిస్తే తను అంత సంపాదించినట్టు అని.. ఆయన ఎంత ఎత్తుకి ఎదిగితే తను అంత ఎత్తుకి ఎదిగినట్టు అని అన్నారు.  ఆయన ఇంకా చాలా అద్భుతాలు చేస్తారు.. ఆయన పక్కనే నేను ఉంటానని అన్నారు బన్నీ వాసు.

బన్నీ వాసు మాటలకు ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్. తనకు తన తండ్రి కన్నా బన్నీ వాసుతో ఎక్కువ కంఫర్ట్ ఉంటుందని గీతా ఆర్ట్స్ లో సినిమా చేసేప్పుడు కూడా నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడానికి బన్నీ వాసు ప్లాన్ చేస్తాడు. తను చెప్పినట్టుగా బన్నీ వాసు తాను ఒకటేనని అన్నారు అల్లు అర్జున్.

తన ఎదుగులలో బన్నీ వాసు పాత్ర చాలా ఉందని అన్నారు అల్లు అర్జున్. ఇలా ఓ నిర్మాత.. స్టార్ హీరో కలిసి ఒకటే మాట చెప్పడం చాలా అరుదు. గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మాతగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే జి.ఏ 2 బ్యానర్ లో మాత్రం యువ హీరోల సినిమాలు వస్తున్నాయి.

ఈమధ్య జి.ఏ 2 కూడా మీడియం బడ్జెట్ సినిమాల రేంజ్ కి వెళ్లింది. 2010లో మొదలైన గీతా ఆర్ట్ 2 సంస్థ ఇలానే కొనసాగుతుందని అన్నారు బన్నీ వాసు. అల్లు శిరీష్ సినిమాతో తనకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న పనైనా సరే సపోర్ట్ గా ఉంటూ వస్తానని అన్నారు బన్నీ వాసు. అల్లు ఫ్యామిలీలో బన్నీ వాసు కూడా ఒక ఇంటి సభ్యుడిగా కలిసిపోయారని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News