ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి రచయిత గా కొనసాగుతున్న వారిలో సాయి మాధవ్ బుర్ర ఒకరు. గత కొంత కాలంగా ఆయన రాస్తున్న మాటలుకు మంచి ఆదరణ దక్కుతోంది. కృష్ణం వందే జగద్గురుమ్ - కంచె - గౌతమి పుత్ర శతకర్ణి సినిమాల్లో ఆయన అందించిన మాటలు చాలా వరకు సినిమాలకు ప్లస్ అయ్యాయి. ఇక మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 లో. కూడా ఆయన పెన్ను పదును చూపించారు. మహానటి సావిత్రి బయోపిక్ కి కూడా ఆయన మాటలను అందించారు.
ఇకపోతే మరో బయోపిక్ కోసం కూడా సాయి మాధవ్ బుర్ర మాటల రచయితగా వర్క్ చేయడానికి సిద్దమయ్యారు. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కోసం చాలా రోజులుగా దర్శకుడు వంశీ కృష్ణ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు దొంగాట అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఆకట్టుకున్నాడు. ఇక రెండవ సినిమా భారీగా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. 1980 కాలంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న టైగర్ నాగేశ్వరరావు అంటే అప్పట్లో చాలా ఫెమాస్.
ఆంద్రప్రదేశ్ లో అతని పేరు చాలా గట్టిగా వినిపించేది. అతని జీవితం కూడా ఎన్నో మలుపులు తిరిగిందనే సాక్ష్యాలు ఉన్నాయి. వంశీకృష్ణ దాదాపు స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి మాధవ్ బుర్ర బలమైన మాటలను అందించడానికి రెడీ అవుతున్నారు. ఇక రానా టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో పట్టాలెక్కనుంది.