250 కోట్ల మార్క్ ని ట‌చ్ చేసిన 'పుష్ప : ది రైజ్'

Update: 2021-12-11 11:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మోస్ట్ పాపుల‌ర్ క్రేజీ ప్రాజెక్ట్ `పుష్ప‌ : ది రైజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని రెండు పార్ట్‌లుగా తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా `పుష్ప‌ : ది రైజ్‌` ముందుగా విడుద‌ల కాబోతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ రిలీజ్ బిజినెస్ ఇప్ప‌టికే 25ఏ కోట్ల మార్కుని దాట‌డం హాట్ టాపిక్‌గా మారింది,

గ‌త ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న బ‌న్నీ ఈ ఏడాది డిసెంబ‌ర్ 17న `పుష్ప‌ : ది రైజ్‌` తో వ‌ర‌ల్డ్ వైడ్ గా హంగామా చేయ‌బోతున్నాడు. గ‌త చిత్రం ఊహించ‌ని స్థాయిలో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డం.. వ‌సూళ్ల ప‌రంగా నాన్ `బాహుబ‌లి` రికార్డుల్ని తిర‌గ‌రాయ‌డంతో `పుష్ప‌ : ది రైజ్‌` పై వ‌ర‌ల్డ్ వైడ్‌గా ట్రేడ్ వ‌ర్గాల్లో డిమాండ్ ఏర్ప‌డింది. దీంతో భారీ స్థాయిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. థియేట్రిక‌ల్ అండ్ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా ఈ సినిమా 250 కోట్ల మార్కుని ప్రీ రిలీజ్ స్టేజ్ లోనే ట‌చ్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఈ సినిమా బిజినెస్ పై హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది.

థియేట్రిక‌ల్‌, ఓవ‌ర్సీస్‌.. డిజిట‌ల్ శాటిలైట్‌... ఓటీటీ.. ఆడియో రైట్స్‌.. ఇలా అన్నింటి ప‌రంగా ఈ సినిమా 250 కోట్ల మార్కుని అవ‌లీల‌గా దాటేసింది. ఈ సినిమాకి ఈ స్థాయిలో బిజినెస్ జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం
బ‌న్నీ గ‌త చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం... అంతే కాకుండా `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన సుకుమార్ .. బ‌న్నీతో క‌లిసి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డం.. స్టైలిష్ స్టార్ .. ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న‌ బ‌న్నీ తొలిసారి ఊర నాటు పాత్ర‌లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ గా డీ గ్లామ‌ర్‌ పాత్ర‌లో న‌టించ‌డం.. ఇప్ప‌టికే విడుద‌లైన లిరిక‌ల్ వీడియోలు నెట్టింట సంచ‌ల‌నం సృష్టిస్తుండ‌టం వంటి కార‌ణాల‌తో ఈ సినిమాకు బిజినెస్ ప‌రంగా హైప్ పెరిగింది.

దీంతో `పుష్ప‌ : ది రైజ్‌`కు అన్ని ఏరియాల్లో భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఆ డిమాండ్ కు త‌గ్గ‌ట్టే అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం ఫ్యాన్సీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్ .. అలానే నాన థియేట్రిక‌ల్ (ఓటీటీ, డిజిట‌ల్ రైట్స్‌) క‌లుపుకుని ఈ సినిమా ఫ‌స్ట్ పార్టే ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్ల మార్కుని దాటింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని బిజినెస్ కావ‌డం.. బ‌న్నీ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ కావ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెసే ఈ రేంజ్ లో వుంటే సినిమా రిలీజ్ త‌రువాత ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ని కురిపిస్తుందో... బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి ట్రెండ్ ని క్రియేట్ చేస్తుందా అని ట్రేడ్ పండితులు అప్పుడే లెక్క‌లు వేయ‌డం మొద‌లు పెట్టారు. డిసెంబ‌ర్ 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌రికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News