ధనుశ్ కెప్టెన్ మిల్లర్.. ది వన్ మ్యాన్ ఆర్మీ

Update: 2023-06-30 18:59 GMT
తమిళ విలక్షణ నటుడు, స్టార్ హీరో ధనుశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనో ఓ పాత్ర పోషించడాంటే.. తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంతలా ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. హాలీవుడ్ లోనూ మెరిశారు.  అయితే ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.  

ధనుష్ కెరీర్‌లో బడ్జెట్ పరంగా  ఇప్పటి వరకు ఇదే అత్యంత భారీ చిత్రం. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా కాలం నుంచి సరైన అప్డేట్ లు లేక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ను ఇచ్చారు మూవీ మేకర్స్.

ధ‌నుశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెస్పెక్ట్ ఈజ్ ఫ్రీడమ్ అంటూ ధనుశ్ ఈ పోస్టర్ కు క్యాప్షన్ రాసుకొచ్చారు. 1930 – 1940ల నాటి నేపథ్యంలో ఈ సినిమా సాగబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనుశ్ రగ్గడ్ లుక్‌లో కనిపించారు.  బ్యాక్‌డ్రాప్‌లో చుట్టూ మిలిటరీ అధికారుల మృతదేహాలు.. ధనుశ్  చేతిలో భారీ గన్‌..  దూరంగా వాహనాలతో యుద్ధం లాంటి దృశ్యం క‌నిపిస్తోంది. ఇది చూస్తుంటే ధనుశ్.. శత్రు సైన్యపు భీకర దాడిలో  పోరాడి అలిసిపోయినట్టు ఉన్న వ్యక్తిలా కనిపించారు.  

ఇక పోతే సినిమా నుంచి వరుస సర్ ప్రైజ్ లు  రానున్నట్లు తెలిసింది.  జూలైలో టీజర్‌ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇంకా ఈ చిత్రంలో కన్నడ లెజండరీ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్  ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.  నివేదిత సతీష్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కూడా కీలక పాత్రలు పోషించారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప తమిళ వెర్షన్ కు డైలాగ్ లు రాసిన మాధన కార్కి కూడా ఈ చిత్రం కోసం పనిచేశారు.  సత్యజ్యోతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇకపోతే ధనుశ్ రీసెంట్ గా తెలుగులో నేరుగా సార్‌ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే యాభై కోట్ల రేంజ్‌లో వసూళ్లను  అందుకుంది. ఈ చిత్రం తెలుగు దర్శకుడే తీసినప్పటికీ.. ఓ తమిళ హీరో సినిమాకు తెలుగులో ఆ రేంజ్‌ వసూళ్లు వచ్చాయంటే.. ఆయన క్రేజ్ కు ఇదే నిదర్శనం అని చెప్పాలి.

Similar News