‘కేరింత’ కుర్రాడి మీద కేసు బుక్ అయ్యింది

Update: 2021-01-22 04:30 GMT
కేరింత సినిమా గుర్తుందా? బుజ్జి సినిమానే అయినా పెద్ద విజయాన్ని సాధించి.. నిర్మాతకు కాసుల వర్షాన్ని కురిపించింది. అందులో నటించిన విశ్వంత్ తాజాగా వార్తల్లోకి వచ్చాడు. రోటీన్ కు భిన్నంగా ఈ కుర్రాడి మీదా తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో.. అతడికి నోటీసులు జారీ చేశారు. ఇంతకీ విశ్వంత్ చేసిన తప్పేమిటి? పోలీసులు ఏం చెబుతున్నారు అన్న విషయంలోకి వెళితే..

తక్కువ ధరకు ఖరీదైన కారు ఇప్పిస్తానని తనకు మాట ఇచ్చాడని.. అనంతరం మోసం చేసినట్లుగా ఒకరు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విశ్వంత్ తో పాటు.. అతని తండ్రి సాయిబాబాతో పాటు స్పేస్ టైమ్ ఇంటీరియర్ నిర్వాహకుడు ఆకాశ్ గౌడ్ పైనా కేసు నమోదైంది. దీంతో.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్వంత్ కు 41ఎ సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మరి.. ఈ వ్యవహారంపై కేరింత కుర్రాడి మాట ఏమిటో చూడాలి.
Tags:    

Similar News