క్యాథరీన్ ట్రెసా కెరీర్ గ్రాఫ్ ని పరిశీలిస్తే వాయిదాల పద్దతిలో తెలుగు..తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. కొన్ని సినిమాలు వరుసగా కోలీవుడ్ లో చేస్తే..ఆ పై టాలీవుడ్ లో అదే ఆర్డర్ లో సినిమాలు చేస్తుంది. మరి బ్యూటీకి అలా కుదిరిందా? లేక ప్లాన్ చేసుకుంటుందా? అన్నది తెలియదుగానీ..రెండు భాషల్ని తెలివిగా మ్యానేజ్ చేస్తుందన్నది మాత్రం అర్ధమవుతుంది.
కెరీర్ చరమాంకానికి చేరుకుంటుందని వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వరుసగా అవకాశాలు అందుకుని నిరూపిస్తుంది. కెరీర్ ప్రారంభం స్ర్టాంగ్ గానే ఉన్నా...అటుపై పరాజయాలతో రేసులో వెనుకబడింది. దీంతో క్యాథరీన్ పనైపోయిందని విమర్శలు తెరపైకి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో కోలీవుడ్ లో బిజీ అయింది.
అక్కడ బిజీ తో టాలీవుడ్ లోనూ అనూహ్యంగా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం క్యాథరీన్ తెలుగులోనే నాలుగైదు సినిమాలు చేస్తుంది. వీటిలో ప్రతిష్టాత్మక చిత్రం `బింబిసార` ఒకటి. త్వరలో ఆ సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో అమ్మడు కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. 40 బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
సినిమాలో `బింబిసార` పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండగా... క్యాథరీన్ ట్రెసా ప్రిన్సెస్ ఐరా గా కనిపించనుంది. ఇప్పటికే ఆ పాత్ర ఆహార్యంలో అచ్చం ప్రిన్సెస్ నే తలపిస్తుంది క్యాథీ. వజ్రవైడూర్యాలు...యువరాణి కాస్ట్య్సూమ్స్ ప్రతీది ఆ పాత్ర ఔన్నత్యాన్ని చాటుతుంది. ఆ గెటప్ క్యాథరీన్ కి బాగా కుదిరింది. అయితే షూటింగ్ సమయంలో క్యాప్చర్ చేసిన ఓ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది.
అందులో క్యాథరీన్ ప్రిన్సెస్ అవతారంలో ముస్తాబై చైర్ లో కూర్చుంది. ఆ అందాన్ని కెమెరా పై నుంచి క్యాప్చర్ చేస్తూ వస్తుండగా...కింద కాళ్లకి మాత్రం తెగిపోయిన పాత చెప్పలు వేసుకుని కనిపిస్తుంది క్యాథీ. ఆ చెప్పుల్ని వీడియోలో హైలైట్ చేసి చూపించారు. పాదాల వద్ద పరికిణీని తొలగించి మరీ ఆ మసిపూసిన కాళ్లని...తెగిన చెప్పుల్ని క్యాప్చర్ చేసారు. అంతే కాదు కాళ్లకి అంటుకున్న నల్లటి బూడిదని అదే తీరున చూపించారు.
Full View

ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారంతా పగలబడి నవ్వడం చూస్తుంటే! ప్రిన్సెస్ పాత్రని అపహేళన చేస్తున్నారా? సరదాకి కామెడీ చేస్తున్నారా? అన్న సందేహం రాకమానదు. పాత్రలో ఔన్నత్యాన్ని చెప్పాల్సింది. .ఆ పాత్ర ఆహార్యాన్నే అవమాన పరిచేలా ఆ వీడియో కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటి జనులు మండిపడుతన్నారు. `పైన పటారం..లోన లొటారం` అంటే ఇలాగే ఉంటుందా? అంటూ ఓ నెటి జనుడు చెప్పుల తీరుని...ఆహార్యాన్ని ఉద్దేశించి కామెంట్ చేసాడు.