హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ జరుగుతున్న విషయం తెలిసిందే. సీబీఐతో పాటు ఈడీ కుడా రంగంలోకి దిగి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించారు. ఆమెతో పాటు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న పలువురిని విచారిస్తున్నారు. అయితే ఇంతకముందు రియా చక్రవర్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ లో రియా ఫోన్ కాల్ లిస్ట్ అని చెప్తూ ఆసక్తికరమైన విషయాలు బయట పెడుతోంది. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో రియా చక్రవర్తి టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ సెలబ్రిటీలు దగ్గుబాటి రానా - రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్ - శ్రద్ధాకపూర్ - ఆదిత్య రాయ్ కపూర్ - మహేష్ భట్ - సన్నీ సింగ్ తో రియా ఫోన్ సంభాషణ చేసినట్లు చెప్పుకొచ్చింది.
అయితే సుశాంత్ సింగ్ తో 2019 డిసెంబర్ నుండి 2020 జూన్ 14 వరకు రియా కేవలం 94 సార్లు మాత్రమే మాట్లాడినట్లు సీడీఆర్ వెల్లడించింది. సుశాంత్ మరణానికి తొమ్మిది రోజుల నుండి రియా అతనితో మాట్లాడలేదని తెలుస్తుంది. జూన్ 6 నుండి జూన్ 14 మధ్య సుశాంత్ రియాల మధ్య ఎటువంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. జూన్ 5న ఉదయం 8:19 నిమిషాలకు సుశాంత్ రియాకు చివరి కాల్ చేసాడని.. అప్పుడు కూడా కేవలం 114 సెకన్లు మాత్రమే మాట్లాడినట్టు తెలిపింది. అంతకముందు జూన్ 1 నుండి జూన్ 4 మధ్య సుశాంత్ మరియు రియా మధ్య కాల్స్ లేవు. అయితే మే నెలలో సుశాంత్ మరియు రియాలు 19 సార్లు మాట్లాడుకున్నారని.. వీరిద్దరూ ఏప్రిల్ లో అసలు ఫోన్ లో మాట్లాడలేదని కాల్ లిస్ట్ వెల్లడించింది. మొత్తం మీద రియా ఫోన్ కాల్ రికార్డ్ ని బట్టి చూస్తే సుశాంత్ - రియాలు గత కొన్ని రోజులుగా సఖ్యతగా లేరనే విషయం అర్థం అవుతోంది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే వార్తలు అబద్ధమని తెలుస్తోంది.
కాకపోతే రియా చక్రవర్తి అదే సమయంలో సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీ మరియు సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 569 కాల్స్ రియా చేయగా ఆమె రియాకు 222 సార్లు కాల్ చేసినట్లు సీడీఆర్ లో వెల్లడైంది. ఆగష్టు 2019 నుండి జూలై 2020 మధ్య సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో రియా 259 సార్లు మాట్లాడినట్లు.. అతను రియాకు 22 సార్లు కాల్ చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ మరణించిన తరువాత కూడా శామ్యూల్ కు రియా కాల్స్ చేసినట్లు తెలిసింది. కాల్ డేటా రిపోర్టులతో పాటు రియా మెసేజ్ లను కూడా సీబీఐ అధికారులు ట్రాక్ చేస్తున్నారని సమాచారం.