మహేష్ కోసం నాగ్ నుంచి ధనుష్ వరకు..

Update: 2017-08-09 11:09 GMT
ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నుంచి తమిళ స్టార్ హీరో ధనుష్ వరకు ఎంతోమంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ సెలబ్రెటీల్లో కొందరి విషెస్...

‘‘మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన ఏడాది ముందుంది’’
-అక్కినేని నాగార్జున

‘‘మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటున్నా’’
-కొరటాల శివ

‘‘మహేష్ కు హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది మా ‘స్పైడర్’తో చాలా ప్రత్యేకం’’
-మురుగదాస్

‘‘టాలీవుడ్ కు గర్వకారణం.. సూపర్ హ్యాండ్స్ మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. ‘స్పైడర్’ తెలుగు-తమిళ భాషల్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’
-రామ్

‘‘వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు అన్నీ అత్యుత్తమంగానే ఉండాలి. నా లాంటి వాళ్లందరికీ ఎప్పుడూ ఇలాగే స్ఫూర్తిగా ఉండండి’’
-రకుల్ ప్రీత్

‘‘హ్యాపీ బర్త్ డే మహేష్. నీకు ఇలాగే ఎప్పుడూ అన్నీ పర్ఫెక్ట్ గా జరగాలి’’
-సమంత

‘‘మన సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు’’
-వెన్నెల కిషోర్

‘‘మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. ‘స్పైడర్’లో మీ లుక్ చాలా బాగుంది. హైదరాబాద్ లో అందమైన వాతావరణాన్ని ఆస్వాదించండి’’
-మంచు లక్ష్మి

‘‘ప్రిన్స్ మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ‘ప్రేమకథా చిత్రమ్’కు మీ కాంప్లిమెంట్స్.. మీ సపోర్ట్ ఇప్పటికీ గుర్తున్నాయి. ‘స్పైడర్’కు ఆల్ ద బెస్ట్’’
-దాసరి మారుతి

‘‘సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీకన్నీ సంతోషాలే ఉండాలి. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది’’
-వంశీ పైడిపల్లి

‘‘మా తరం సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు’’
-సాయిధరమ్ తేజ్

‘‘మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సుఖ సంతోషాలు కలగాలి’’
-ధనుష్

‘‘నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీకు మరిన్ని విజయాలు రావాలి’’
-కాజల్ అగర్వాల్
Tags:    

Similar News