కరోనా మహమ్మారీ సెకండ్ వేవ్ రకరకాల సందిగ్ధతలకు కారణమవుతోంది. మునుపటితో పోలిస్తే జనం అంత భయపడకపోయినా అజాగ్రత్తతో ముప్పు కొని తెచ్చుకుంటున్నారన్న విశ్లేషణ సాగుతోంది. ఇక సెలబ్రిటీల్ని వెంటాడుతున్న కరోనా వ్యవహారం మాత్రం భయం కలిగిస్తోంది.
అయినా షూటింగులు ఆపేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. స్టార్లంతా సెట్స్ లో తమ పనిలో తాము ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి.. మహేష్.. ప్రభాస్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ .. ఎన్టీఆర్ .. ఇలా అగ్ర హీరోలంతా సెట్స్ పైనే ఉన్నారు.
అయితే మహేష్ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న గోవా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారని తెలిసింది. ఉత్తరాదిన సెకండ్ వేవ్ టెన్షన్స్ వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గోవా షెడ్యూల్ ని అలా ఉంచి.. తదుపరి హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరణ సాగించనున్నారని తెలుస్తోంది. ఈ నెల మిడ్ నుంచి నిర్విరామంగా 25 రోజులు పాటు చిత్రీకరణ సాగుతుందట. సర్కార్ వారి సెట్స్ లో కరోనా నియంత్రణ నియమావళి కఠినంగా ఉందని కూడా చెబుతున్నారు.