భార్య నుదిట‌న కుంకుమ దిద్దిన‌ చ‌ర‌ణ్‌!

Update: 2022-08-19 15:21 GMT
మెగాకోడ‌లు ఉపాస‌న సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో?  చెప్పాల్సిన ప‌నిలేదు. భ‌ర్త చ‌ర‌ణ్ వృత్తిగ‌త  విశేషాల‌తో పాటు..సోష‌ల్ అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన అంశాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటారు. ఇక‌ స్పెష‌ల్ డేస్ సెల‌బ్రేష‌న్స్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. కుటుంబంలో జ‌రిగే ప్ర‌తీ ఈవెంట్ ని అభిమానుల‌కు షేర్ చేస్తుంటారు.

తాజాగా నేడు కృస్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఇంట్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇంట్లోనే పూజను ఎంతో ప్ర‌త్యేకంగా నియ‌మ నిష్ట‌ల‌తో చేసిన‌ట్లు  తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్నారు. ఇంట్లో దేవుడి గ‌దిని ప్ర‌త్య‌కంగా ముస్తాబు చేసి..దేవుడి ఫోటోల్ని  పూల మాల‌..ప‌ళ్లు ప‌ల‌హారాల‌తో అందంగా అలంక‌రించారు.

అనంత‌రం ఉపాస‌న-చ‌ర‌ణ్ దంప‌తులు ప్రత్యేక పూజ‌లు చేసారు. పూజ అనంత‌రం ఇదిగో ఇలా స‌తీమ‌ణి నుదిటిన‌ చ‌ర‌ణ్‌ కుంకుమ బొట్టు దిద్దారు. సంప్ర‌దాయ గులాబీ రంగు దుస్తుల్లో ఉపాస‌న క‌నిపిస్తున్నారు.  చ‌ర‌ణ్ బ్లాక్ క‌ల‌ర్ టీష‌ర్ట్..తెలుపు రంగు పంచె కంటు ధ‌రించారు. కృష్ణాష్ట‌మి రోజున చివ‌రి వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌త శుక్ర‌వారం కూడా క‌లిసొచ్చింది.

ఈ సంద‌ర్భంగా అన్ని ర‌కాల పండుగ శుభాకాంక్ష‌లు ఇన్ స్టా వేదిక‌గా దంప‌తులిద్ద‌రు అభిమానుల‌కు తెలియ‌జేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మెగా అభిమానుల్ని  దంప‌తులిద్ద‌రు ఇలా చూసి మురిసిపోతున్నారు. ఇది చాలా రేర్ పిక్ . దీంతో సంథింగ్ స్పెష‌ల్ గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. హిందు సంప్ర‌దాయ పండుగ‌ల‌న్నింటిని మెగా దంప‌తులు ప్ర‌తీ ఏటా ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తుంటారు.

గ‌తేడాది వ‌ర‌ల‌క్ష్మి దేవి  వ్ర‌తాన్ని ఉపాస‌న అత్త‌గారు సురేఖ‌..బామ్మ అంజ‌నా దేవితో క‌లిసి జ‌రుపుకున్న సంగ‌తి  తెలిసిందే.  ప్ర‌స్తుతం షూటింగ్ లు బంద్ కొన‌సాగ‌డంతో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. కుటుంబాల‌కు కావాల్సినంత స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో కలిసొచ్చిన పండుగ‌ల్ని భార్యామ‌ణుల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్  శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రంలో న‌టిస్తోన్న‌ తెలిసిందే.
Tags:    

Similar News