ఆ బిజీ విలన్ కి ఎంగేజ్మెంట్ అయింది

Update: 2016-09-04 06:45 GMT
చరణ్ దీప్ సర్నేని ఇప్పుడు బిజీ విలన్ గా మారిపోయాడు. నాలుగైదు ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. గతేడాది నుంచి ఈ యంగ్ విలన్ రేంజ్ మారిపోయింది. పటాస్.. బాహుబలి(కాలకేయుడి బ్రదర్).. లోఫర్ లాంటి సినిమాలో టాలీవుడ్ లో ఈ హీరో పేరు మార్మోగిపోగా.. అప్పటికే విజయ్ కి విలన్ గా తమిళ్ లో జిల్లాతో పేరు ప్రఖ్యాతులు సంపాదించేశాడు.

ఇప్పుడీ విలన్ కి పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్ధానికి సంబంధించి తన కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు చరణ్ దీప్. ఆలీ.. ఆది వంటి పలువురు సినిమా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. తమ నిశ్చితార్ధానికి వచ్చిన వారికి.. రాలేకపోయిన వారికి.. తమను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్యూ చెప్పాడు చరణ్ దీప్.

ఇప్పుడు కూడా చరణ్ దీప్ సర్నేని చాలానే సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే చుట్టాలబ్బాయి విడుదల కాగా.. తమిళ్ లో కత్తి సాందాయ్.. మొట్ట సివ కెట్ట శివ.. తెలుగులో  సునీల్ తో ఈడు గోల్డ్ ఎహెతో పాటు.. పలు కన్నడ సినిమాల్లో కూడా లీడ్ రోల్స్ చేసేస్తున్నాడు. ఒకేసారి చేతిలో 8 సినిమాలు హ్యాండిల్ చేస్తున్నాడంటే.. ఈ విలన్ స్పీడ్ అర్ధమవుతుంది.

Tags:    

Similar News