ఓకే ఛార్మీ.. వాటి సంగతేంటి?

Update: 2016-02-24 17:30 GMT
టాలీవుడ్ లో మంచి పొజిషన్ ఎంజాయ్ చేసిన ఛార్మీ కౌర్.. ఇప్పుడు కెరీర్ పరంగా బాగా డల్ అయింది. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు తీసుకున్న కొన్ని డెసిషన్స్.. ఈ పరిస్థితికి కారణం అనే విశ్లేషణలు ఉన్నా.. వీటిని పెద్దగా పట్టించుకోదు ఈ భామ. రీసెంట్ గా ఛార్మి నటించిన మూవీ జ్యోతి లక్ష్మి. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. అటు హీరోయిన్ గాను, ఇటు నిర్మాతగాను ఛార్మికి దెబ్బ తగిలింది. అయితే ఈ సిట్యుయేషన్ నుంచి స్పీడ్ గానే కోలుకున్న ఛార్మి.. ప్రస్తుతం టూర్లతో ఎంజాయ్ చేస్తోంది. ప్రపంచం మొత్తం షికార్లు కొట్టేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ తెగ సరదాగా గడిపేస్తోంది.

తన ఆనందాన్ని సింగిల్ గా దాచేసుకునే అలవాటు లేని ఈ సీనియర్ సుందరి.. ఆ హ్యాపీనెస్ ని తన అభిమానులతో కూడా పంచుకుంటోంది. ఇదిగో ఇలా ఫోటోలు షేర్ చేస్తూ.. బీచ్ బేబీ విత్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటోంది. అయితే.. ఛార్మీ సంతోషం బాగానే ఉంది కానీ.. మరీ కొంచెం స్పీడ్ ఎక్కువైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే.. అమ్మడు కూర్చున్న సీట్ ఎదురుగా టేబుల్ పై ఆల్కహాల్ - సిగరెట్ ప్యాకెట్ - లైటర్ లు ఉన్నాయి.

ఎంజాయ్మెంట్ అంటూ వీటిని లాగించేస్తున్నానని ఇన్ డైరెక్టుగా చెప్పేయడం ఆశ్చర్యకరం. మరీ ట్రెడిషన్ లాంటి పెద్ద పదాలు వాడలేం కానీ.. హీరోయిన్స్ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కదా. లేకపోతే.. కామెంట్స్ కాస్త కటువుగా పడే ఛాన్సులుంటాయి.
Tags:    

Similar News