'చెప్పకే చెప్పకే' సాంగ్.. రష్మిక మెచ్చిన మహాసముద్రం మెలోడీ..!

Update: 2021-09-06 06:35 GMT
'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ''మహాసముద్రం''. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - 'హే రంభా' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని 'చెప్పకే చెప్పకే' అనే మెలోడీ గీతాన్ని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

'చెప్పకే చెప్పకే' అంటూ సాగే ఈ ఫీల్‌ గుడ్‌ ప్రేమ పాట నాకు బాగా నచ్చింది. చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌. శర్వా ఇటీవల నాకు సినిమా ట్రైలర్‌ కూడా చూపించారు. అందరూ అదరగొట్టేశారు అని రష్మిక పేర్కొన్నారు. పాట విషయానికొస్తే 'చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. చాలులే వేళాకోళం ఉరుకు.. నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు.. మనసా మళ్ళీరాకు వెళ్లిపో..' అంటూ సాగిన మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ సమకూర్చిన బాణీలకు.. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. గాయని దీప్తి పార్థసారధి వాయిస్ ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉంది. ఇది మరో చార్ట్ బస్టర్ అవుతుంది.

'చెప్పకే చెప్పకే' పాటను అదితి రావు హైదరి మీద చిత్రీకరించినప్పటికీ.. ఇందులో శర్వానంద్ - సిద్ధార్థ్ మరియు అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. అలానే సాంగ్ లో శర్వానంద్ పొరిగింటి అమ్మాయి అయిన అదితి రావు హైదరి అతడిని ప్రేమిస్తోంది. శర్వా ని సీక్రెట్ గా ఫాలో అవుతూ అతనితో ఊహాలోకంలో అతిధి విహరిస్తోంది. అయితే శర్వా జీవితంలోకి అను ఇమ్మాన్యుయేల్ వస్తుంది. ఈ క్రమంలో అదితి.. సిద్ధార్థ్‌ తో సన్నిహితంగా మెలుగుతున్నట్లు సాంగ్ లో చూపించారు. మరి ఈ ప్రేమకథ వెనకున్న కథేంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

''మహాసముద్రం'' చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు - రావు రమేష్ - గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.





Full View


Tags:    

Similar News