కాలం మారినా తన కథ మారలేదు అంటున్నారు చిరంజీవి.. 1990 అయినా.. 2020 అయినా తానే వంట చేస్తున్నానని.. తన భార్య వెనుకాల ఉండి సాయం చేస్తుందని అర్థం ఇచ్చేలా ఒక సెటైరికల్ ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అప్పుడు జాయ్ ఫుల్ గా ఉంటే.. ఇప్పుడు జైల్ లో ఉన్నట్టు ఉందని ప్రస్తుత పరిస్థితిపై చిరంజీవి సెటైర్ వేసుకున్నారు.
అది 1990.. అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సమయం.. నాడు తను వంట చేస్తుండగా.. చిరంజీవి భార్య వంటలో సాయం చేస్తూ వెనుకాలే నిలబడ్డారు. నిజానికి పెళ్లైన కొత్తలో తన భార్య సురేఖకు వంట చేయడం రాలేదని.. తనే నేర్పించానని చిరంజీవి చెప్పుకొచ్చాడు. బహుశా తర్వాత నేర్చుకున్నా కూడా చిరంజీవి మాత్రం తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఇప్పటికీ భార్యను పక్కనపెట్టి వంట చేస్తున్నారేమో..
తాజాగా 1990లో అమెరికాలో హాలీడేస్ లో ఉన్నప్పటి ఫొటోను.. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రస్తుతం నిర్బంధంలో ఉండి వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశాడు. అదే డ్రెస్.. అదే సిట్య్చువేషన్ ను చిరంజీవి క్రియేట్ చేసి ఫన్నీగా ఫొటోను షేర్ చేశారు. దానికి ‘కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదంటున్నారు’ అని చిరంజీవి క్యాషన్ ఇచ్చి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
అమెరికాలో 1990లో దిగిన ఫొటోకు ‘జాయ్ ఫుల్ హాలీడే ఇన్ అమెరికా’ అని క్యాప్షన్ ఇచ్చి.. రెండో ఫొటో ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంట్లో వంట చేస్తున్న ఫొటోకు ‘జైల్ ఫుల్ హాలీడే ఇన్ మహమ్మారి’ అని సరదా వ్యాఖ్యను జోడించి చిరంజీవి షేర్ చేశారు. అది ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.