స్టార్ హీరోలు సహజంగానే ఒక సినిమా చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. కొందరు స్టార్లకు ఒక సినిమా చేయాలంటే ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతోంది. అంతేకాదు యువ దర్శకులతో పని చేయడానికి తటపటాయిస్తుంటారు. కానీ ఈ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. లేటు వయసు లో కూడా సూపర్ ఎనర్జీతో దూసుకు పోతూ కొత్త దర్శకులతో పని చేస్తూ ఈ తరం హీరోలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.
రజినీకాంత్ వయస్సు ఇప్పుడు 69. అయితే రిటైర్మెంట్ అనే మాటే లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు రజిని. ఓ నాలుగేళ్ల క్రితం రజిని ఒక్కో సినిమాకు ఏడాది ఏడాదిన్నరగా తీసుకునేవారు కానీ ఈ మధ్య ఆరు నెలల్లో చకచకా పూర్తి చేస్తున్నారు. పైగా యువ దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పా రంజిత్.. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి యువ దర్శకులతో పాటుగా మురుగదాస్.. శివ లాంటి కమర్షియల్ డైరెక్టర్ తో కూడా రజినీ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమాను లైన్లో పెడుతున్నారు. 70 కి చేరు అవుతున్నా ఈ వయసులో ఇలాంటి ఉత్సాహం మాత్రం ఇతరుల నుంచి ఊహించలేం.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికీ తన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. సినిమాలు చేయడంలో ఎక్కువ టైం తీసుకుంటున్నారు కానీ డాన్సులు ఫైట్లు విషయంలో ఆయన ఈతరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అంతేకాదు.. ఈమధ్య సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచుతున్న సంకేతాలు ఇచ్చారు. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాబీతో.. సుజిత్.. మెహర్ రమేష్ లాంటి యువ దర్శకులతో సినిమాల ప్లానింగ్ జరుగుతోందని ఇంటి ఇచ్చారు. చిరు స్పీడు చూస్తుంటే ఈసారి సినిమా సినిమాకు ఆరు నెలల కంటే ఎక్కువ గ్యాప్ వచ్చేలా కనిపించడం లేదు. 64 ఏళ్ళ వయసులో చిరంజీవి జోరు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవడం ఖాయం. మరి ఊరికే సూపర్ స్టార్లు.. మెగాస్టార్లు అయిపోతారా??