మెగా స్టార్ చిరంజీవి కామియో క్యారెక్టర్ చేయడం అంటే అది ఇంట్రెస్టింగ్ టాస్క్. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చ సాగుతోంది. మెగాస్టార్ బ్రూస్ లీ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారు.. అనగానే అటు మెగాభిమానుల్లో, ఇటు సినిమా వర్గాల్లో ఆరాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చేసే క్యారెక్టర్ ఎలాంటిది? ఎలాంటి ట్విస్టిస్తాడు? అన్న క్యూరియాసిటీ రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రూస్ లీ రిలీజ్ అక్టోబర్ 16 అంటూ ప్రకటించేశారు. కాబట్టి ఇంకెంతో సమయం లేదు.
అయితే చిరు కామియో అప్పియరెన్స్ ఇదే మొదటి సారి కాదు..ఇది మూడోసారి. 90లలో రజనీకాంత్ హీరోగా నటించిన మాప్పిళ్లై చిత్రంలో చిరు కామియో అప్పియరెన్స్ ఇచ్చారు. అది సినిమాలో కీలకమైన సందర్భం. రజనీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంటాడు. ఆ టైమ్ లో సరిగ్గా గూండాలు ఎంటరై ఆ పెళ్లిని చెడగొట్టడానికి రజనీ మీదికి వస్తారు. సరిగ్గా అలాంటి సందర్భంలో చిరు ఎంట్రీ ఉంటుంది. ఆ గూండాల నుంచి పెళ్లికొడుకుని పెళ్లి కూతురిని కాపాడి పెళ్లి సీన్ ని సుఖాంతం చేస్తాడు. అలాగే చాలా కాలం తర్వాత లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైల్ చిత్రంలో చిరు ఇంచుమించు అదే తరహా కామియోలో అప్పియరెన్స్ ఇచ్చారు. క్లయిమాక్స్ లో ప్రభుదేవా - లారెన్స్ అండ్ టీమ్ విజయాన్ని ఆపాలని విలన్ ఎంతో ట్రై చేస్తుంటాడు. సరిగ్గా ఆ టైమ్ లో చిరు ఎంట్రీ ఉంటుంది. ఫ్లాష్ లా చిరు మెరవగానే థియేటర్ లో విజిల్సే విజిల్స్.
ఇప్పుడు మరోసారి అలాంటి మెరుపునే మెరిపించబోతున్నాడు చిరు. చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్లీ చిత్రంలో తళుక్కున మెరవబోతున్నాడు. చరణ్ తన ప్రియురాలిని - తండ్రిని ఒకేసారి గూండాల భారి నుంచి కాపాడుకునే సందర్భం. ఆ టైమ్ లో చిరు ఎంట్రీ ఇస్తాడు. ప్రేయసిని కాపాడి ప్రియుడికి అప్పజెప్పుతాడు. ఈ యాక్షన్ సీన్ ని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే గూండాల నుంచి హీరోని కాపాడే సీన్ చిరుకి కొత్తేమీ కాదు. రజనీకాంత్ - ప్రభుదేవా,.. ఇప్పుడు చరణ్.. అంటే మూడో ఎటెంప్ట్ అన్నమాట!