సర్దార్ డైరెక్టర్ కి చిరు ఆఫర్!?

Update: 2016-01-28 11:41 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం హైలైట్ అయ్యింది. రావడమే కాదు.. అందరితోనూ కబుర్లు కూడా చెప్పారు. సరదాగా సెల్ఫీలు దిగారు. కెమేరాలకు ఫోజులిచ్చారు. అయితే ఈ సడెన్ సర్ ప్రయిజ్ విజిట్ వెనక.. ఇంకో రీజన్ కూడా ఉందని తెలుస్తోంది. మెగా విజిట్ లో అన్నిటి కంటే మించి సర్దార్ డైరెక్టర్  బాబీతో మెగాస్టార్ ఎక్కువసేపు మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది.

సర్దార్ గురించిన అప్ డేట్స్ తో పాటు మరిన్ని విషయాలు కూడా చిరు మాట్లాడారని తెలుస్తోంది. ముఖ్యంగా సర్దార్ రిజల్ట్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పారట మెగాస్టార్. దీంతోపాటు తర్వాత చేయనున్న ప్రాజెక్టులపై చిరంజీవి ఆరా తీశారని అంటున్నారు. ఈ మీటింగ్ ను బట్టి.. మెగా క్యాంప్ నుంచి బాబీకి మరిన్ని ఆఫర్స్ రెడీ అయినట్లే అంటున్నారు టాలీవుడ్ జనాలు. సర్దార్ రిజల్ట్ కరెక్ట్ గా వస్తే.. మెగా హీరోల నుంచి మరిన్ని సినిమాలు బాబీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవికి ఒక డైరెక్టర్ కనుక నచ్చితే.. వరుసగా మూవీస్ ఇచ్చే అలవాటు ఉంది.

తన కొడుకు చరణ్ కు కూడా డైరెక్టర్లను రిఫర్ చేస్తూ ఉంటారు. అంతే కాదు.. ఒక్క పవన్ తప్ప మిగిలిన మెగా హీరోల విషయంలో ఫైనల్ డెసిషన్ చిరుదే అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బాబీకి బంపర్ ఆఫర్ వచ్చేసినట్లే అని తెలుస్తోంది. చేతిలో ఉన్న ప్రాజక్టును పక్కాగా డీల్ చేస్తే.. టాప్ లీగ్ డైరెక్టర్ల జాబితాలోకి ఎంటర్ అయ్యే ఆఫర్ ఇది అని చెప్పచ్చు.
Tags:    

Similar News