మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. 'సైరా' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేసి పకడ్బందీ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారట. ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా నటీనటులను.. టెక్నిషియన్లను ఫైనలైజ్ చేసే ప్రయత్నాలలో ఉన్నారట.
తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేదిని లాక్ చేశారని వార్తలు వస్తున్నాయి. కొరటాల ఇప్పటివరకూ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.. అన్నిటికీ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ ను తీసుకోవాలనే ఆలోచన చేసింది కొరటాల కాదట. చిరంజీవి స్వయంగా అమిత్ పేరును కొరటాలకు సూచించారట. 'సైరా' చిత్రానికి మొదట రెహమాన్ ను అనుకున్నప్పటికీ తర్వాత ఆయన తప్పుకోవడంతో అమిత్ త్రివేదికి ఆ భాద్యతలు అప్పగించారు. 'సైరా' కు అమిత్ చేసిన వర్క్ కు మెగాస్టార్ ఫుల్లుగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే మరోసారి తన సినిమాకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. అమిత్ వర్క్ ను చూసిన కొరటాల కూడా ఇంప్రెస్ కావడంతో ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా లాక్ చేశారని సమాచారం.
అమిత్ బాలీవుడ్ లో 'దేవ్ డి'.. 'వేక్ అప్ సిడ్'.. 'క్వీన్'.. 'నో ఒన్ కిల్డ్ జెస్సికా'.. 'ఇష్క్ జాదే'..'ఇంగ్లీష్ వింగ్లిష్' లాంటి సినిమాలకు సంగీతం అందించాడు. దాదాపు అరవై సినిమాలకు సంగీతం అందించాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఫిలిం 'తఖ్త్' కు సంగీతం అందిస్తున్నాడు. మరి అమిత్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.