బోయపాటితో మెగాస్టార్!
ఇప్పుడు ఎక్కడ ఎవరి నోటా విన్నా బోయపాటి పేరే వినిపిస్తోంది. 'అఖండ'ను అద్భుతంగా తీశాడని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణకి ఉన్న క్రేజ్ కీ .. ఆయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ కి మళ్లీ ఇన్నాళ్లకీ మంచి సినిమా పడిందని అంటున్నారు. బాలకృష్ణ అభిమానుల అంచనాలను దాటేసి వెళ్లడం ఈ సినిమా ప్రత్యేకత. సాధారణంగా బోయపాటి సినిమాలు మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా థియేటర్స్ కి రప్పిస్తుంటాయి. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది .. ఆకట్టుకుంటోంది. 'వినయ విధేయ రామా' సినిమాతో వచ్చిన విమర్శలను 'అఖండ' తుడిచిపెట్టేసింది.
ఈ సినిమా తరువాత బోయపాటి సినిమా బన్నీతో ఉండనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. గీతా ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత చిరంజీవితో బోయపాటి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇది ఎమోషన్ తో కూడిన పక్కా మస్ యాక్షన్ మూవీ అని అంటున్నారు.
చరణ్ తో బోయపాటి 'వినయ విధేయ రామా' చేసినప్పుడే, ఆయనతో ఒక సినిమా చేయాలని ఉందనే ఉత్సాహాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. అయితే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. పైగా కథాపరంగా .. కొన్ని సన్నివేశాల పరంగా విమర్శలను మూటగట్టుకుంది. దాంతో చిరంజీవి వెనకడుగు వేయడం జరిగింది. ఇప్పుడు 'అఖండ'తో బోయపాటి తానేమిటనేది మళ్లీ నిరూపించుకున్నాడు. అందువలన ఆయనతో చేయడానికి బన్నీ ఆసక్తిని కనబరుస్తున్నాడు. చిరంజీవి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాల్లో 'ఆచార్య;' విడుదలకు సిద్ధమవుతూ ఉండగా, 'గాడ్ ఫాదర్' సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఆ తరువాత లైన్లో మెహర్ రమేశ్ 'భోళా శంకర్' .. బాబీ 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఆయన బోయపాటితో చేయాలనుకుంటే అందుకు పూర్తి అవకాశం ఉంటుంది. మెగాస్టార్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అందువలన కాస్త అటు ఇటుగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.