సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిరంజీవికి ఆహ్వానం పంపిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సంగతి తెలిసినదే. ఏపీ సీఎంని కలిసే ముందే సమస్యలపై ఒక అవగాహన కోసంక ఈ భేటీలో చర్చ సాగింది.
ఈ చర్చా సమావేశంలో కొంతమంది అగ్ర నిర్మాతలు- పంపిణీదారులు - ఎగ్జిబిటర్ లను పిలిచారు. ఈ సందర్భంగా కీలకమైన వీపీఎఫ్ ఫీజులపైనా చర్చ సాగింది. అల్లు అరవింద్ - దిల్ రాజు - సురేష్ బాబు - సునీల్ నారంగ్ కూడా ఉన్నారు. పంపిణీదారుల నుండి వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) వసూలు చేయవద్దని ఆ నలుగురిని చిరంజీవి హెచ్చరించారని తెలుస్తోంది.
VPF అనేది గత కొన్నేళ్లుగా పంపిణీదారులు చెల్లిస్తున్నారు. రూ.25000 -రూ. 30000 వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఇప్పుడు చిరంజీవి ఈ నలుగురు టాప్ డిస్ట్రిబ్యూటర్ లకు కచ్చితంగా చెప్పారు. వారు ఈ అద్దెను డిస్ట్రిబ్యూటర్ల నుండి తీసుకోవడం మానేయాలని థియేటర్ యజమానుల నుండి తీసుకోమని కోరారు.
చిరంజీవి ధృఢంగా పరిశ్రమ కోసం తనవంతు ప్రయత్నం చేయాలనుకుని ఇదంతా చేస్తున్నారని ఈసారి తన సొంత బావమరిది అల్లు అరవింద్ ని కూడా వదల్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు - అల్లు అరవింద్ మెగాస్టార్ ప్రపోజల్ కి వెంటనే అంగీకరించారు. కానీ సునీల్ నారంగ్ - సురేష్ బాబు ఇద్దరూ ఒక వారంలో ఏదో ఒకటి చెబుతామని అన్నారని తెలుస్తోంది.
ఇక ఈ భేటీలో టిక్కెట్టు ధరపైనా కీలకంగా చర్చ సాగింది. ఆన్‌లైన్ పోర్టల్స్ టికెటింగ్ పైనా ఈ భేటీలో చిరంజీవితో సినీపెద్దలు చర్చించారు. ఆన్ లైన్ లో ఏదైనా బుక్ చేసినప్పుడు మాకు తక్కువ ధరకు లభిస్తుంది. కానీ టిక్కెట్ ధరను మించి ఒక్కో టికెట్ పై దాదాపు రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ అదనపు ఫీజు బాదుడు తగ్గించమని చిరు కోరినట్టు తెలిసింది. ప్రజలు ఎక్కువగా థియేటర్ల వైపు రావాలంటే టిక్కెట్టు ధరల సవరణ అవసరమని కోరినట్టు తెలుస్తోంది.
పంపిణీదారులు- ఎగ్జిబిటర్ లందరికీ వారు మొదట సరిగ్గా ఉండాలని చెప్పారు. లోపాయి కారీ వసూళ్లు సరికాదని అవ్యవస్థను సమూలంగా మార్చాలని చిరు వారిని కోరారు. ముందు మన ఇంటిని సరిగ్గా సెట్ చేసుకుంటే అప్పుడు అన్ని ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని అడగవచ్చు అని చిరు అన్నారట.
ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నలుగురిగా అల్లు అరవింద్ - దిల్ రాజు- సురేష్ బాబు -సునీల్ నారంగ్ లను చాలా విషయాల్లో మారాలని చిరంజీవి సున్నితంగా హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్ల సమస్యతో పాటు టికెట్ ధరలపై సీఎంతో చర్చించే ముందు ముందు మనమే మారాలని చిరు సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో దామోదర ప్రసాద్- యార్లగడ్డ సుప్రియ- వంశీ- ప్రమోద్- దిల్ రాజు- నటుడు నాగార్జున- దర్శకులు కొరటాల శివ- వివి వినాయక్ తదితరులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ముఖ్యమంత్రిని కలిసే ముందు తన తదుపరి సమావేశంలో ప్రముఖ నటులందరినీ కలవాలని కూడా యోచిస్తున్నారు. మునుముందు మంచు మోహన్ బాబు.. నటసింహా నందమూరి బాలకృష్ణలతోనూ భేటీ అవ్వనున్నారని ఇన్ సైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.