ఎంత కాలమైనా పట్టనీ.. అద్దిరిపోయే ఔట్ పుట్ రావాలనే దర్శకుడు ఒకవైపు.. ఎలాంటి ఎమోషన్ కావాలో తీసుకో.. పలికించడానికి తాము రెడీ అనే హీరోలు ఈవైపు.. ఎన్ని కోట్లు కోవాలో తీసుకో.. బ్లాక్ బస్టర్ బొమ్మ ఇవ్వు అనే నిర్మాత ఇంకో వైపు.. ఇలా ఎవరికి వారు మిగతా విషయాలన్నీ వదిలేసి ఓ యజ్ఞంలా పూర్తిచేస్తున్న సినిమా రౌద్రం.. రణం.. రుధిరం!
ఈ చిత్రం కోసం యావత్ ప్రపంచం కళ్లు పెద్దవి చూసుకొని చూస్తోంది. ఇక, మెగా, నందమూరి అభిమానులైతే.. అక్టోబరు 13కు ఇంకా ఎన్ని రోజులు ఉంది అని గుర్తొచ్చినప్పుడల్లా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ కూడా చేరిపోయినట్టున్నారు. ఆయన కూడా RRR కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసుగానీ.. మరీ ఉండబట్టలేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని మాత్రం ఇప్పుడే తెలిసింది.
లేటెస్ట్ గా RRR రషెస్ చూడాలని రాజమౌళిని కోరాడట చిరు. వాస్తవానికి సినిమా కంప్లీట్ అయ్యే వరకూ ఎవరికి చూపించడు జక్కన్న. కానీ.. మెగాస్టార్ అడిగిన తర్వాత కాదని అనలేడు కాబట్టి.. ఒన్ ఫైన్ డే ఎడిటింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి చూపించాడట రాజమౌళి. ఇది చూసిన చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశాడట.
ఆయన చూసింది ఫైనల్ మూవీ కానేకాదు. ఇంకా మిక్సింగ్ జరగాల్సి ఉంది. రీ-రికార్డింగ్ కూడా కాలేదు. ఇవేవీ లేకుండా చూస్తేనే గూస్ బంస్ అనేట్టుగా ఉందని, ఇవన్నీ.. కంప్లీట్ అయిన తర్వాత చూస్తే మామూలుగా ఉండదంటూ రాజమౌళిని పొగడ్తల్లో ముంచేశాడట చిరు.
ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని, బాహుబలిని మించి పోతుందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించాడట. మెగాస్టార్ అంచనాలు నిజాలైన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు RRR గురించి ఈ స్థాయిలో చెప్పడంతో హాట్ టాపిక్ గా మారింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ బారీ బడ్జెట్ మూవీ.. వచ్చే దసరాకు రిలీజ్ కాబోతోంది.